ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. తనకు తీవ్రమైన బాధ కలిగిన రోజుగా ఈరోజును(డిసెంబర్-16,2019)ను ప్రధాని అభివర్ణించారు. ప్రజా ఆస్తులకు నష్టం, సాధారణ జీవితానికి భంగం కలిగించడం దేశ ధర్మంలో భాగం కాదని మోడీ అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టంపై హింసాత్మక నిరసనలు దురదృష్టకరం. తీవ్ర బాధను కలిగిస్తున్నాయి. చర్చ, వాదం,అసమ్మతి ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన భాగాలు. కానీ ఎప్పుడూ ప్రజా ఆస్తులకు నష్టం చేకూర్చడం, సాధారణ జీవితానికి భంగం కలిగించడం మన ధర్మంలో భాగం కాదు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారతదేశపు అభివృద్ధి, ప్రతి భారతీయుల సాధికారత కోసం, ముఖ్యంగా పేదలు, అణగారిన,అట్టడుగున ఉన్నవారి కోసం మనమందరం కలిసి పనిచేయడం ఈ కాలపు అవసరం. మమ్మల్ని విభజించడానికి మరియు అవాంతరాలను సృష్టించడానికి స్వార్థ ఆసక్తి సమూహాలను మేము అనుమతించము అంటూ మోడీ తన ట్వీట్ లో తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు..క్రమ క్రమంగా దేశంలోని వివిధ యూనివర్సిటీలకు పాకుతున్నాయి. ఢిల్లీలోని JNU, జామియా వర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, కోల్ కతా జాదవ్ యూనివర్సిటీ, వారణాసిలోని బనారస్ హిందూ వర్సిటీ, యూపీలోని ఆలీఘడ్ ముస్లిం వర్సిటీ, దక్షిణాది ప్రాంతంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీలో స్టూడెంట్స్ ఆందోళనలు చేపడుతున్నారు. జామియా విద్యార్థులపై పోలీసలు లాఠీ ఝులిపించడాన్ని అందరూ ఖండిస్తున్నారు. జామియా యూనివర్శిటీ విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ముందుకు జామియా యూనివర్సటీ ఘటన రాగా తాము ప్పుడే జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చిచెప్పింది. అల్లర్లు అదుపులోకి వస్తే..విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
జరుపుతామని స్పష్టం చేసింది.