Faizabad MP Awadhesh Prasad : ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ మీడియా ముందు బోరున విలపించడం హాట్ టాపిక్ గా మారింది. అయోధ్య సమీపంలో అత్యాచారానికి గురైన 22 ఏళ్ల దళిత యువతికి న్యాయం చేయలేకపోతున్నానంటూ ఏడ్చేశారు అవనేశ్. యువతికి న్యాయం జరక్కపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. ఎంపీ ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
22ఏళ్ల యువతిని అత్యాచారం చేసి చంపేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మాట్లాడుతూ ఎంపీ అవదేశ్ ప్రసాద్ బాగా ఎమోషనల్ అయ్యారు. చిన్నపిల్లాడిలా బోరున విలపించారు. గుక్కపట్టి ఏడ్చారు. పక్కనే ఉన్న వాళ్లు ఓదార్చే ప్రయత్నం చేసినా.. ఆయన మాత్రం ఏడుపు ఆపలేదు.
Also Read : ఓ మై గాడ్.. ఇతడి జీతం ఎంతో తెలిసి ఏకంగా సీఎం చంద్రబాబే షాకయ్యారుగా.. ఆ తర్వాత ఎంత రచ్చ జరిగిందంటే..
”నేను ఢిల్లీ వెళ్తాను. యువతి ఘటనపై ప్రధాని మోదీ ముందు లోక్ సభలో ప్రస్తావిస్తాను. యువతి కుటుంబానికి న్యాయం జరక్కపోతే నా పదవికి రాజీనామా చేస్తాను. మన ఆడబిడ్డలను కాపాడుకోవడంలో విఫలం అవుతున్నాం. చరిత్ర మనల్ని క్షమించదు. అయ్యో రామా, సీతమ్మ తల్లి.. మీరు ఎక్కడ ఉన్నారు?” అంటూ బోరున విలపించారు ఎంపీ అవదేశ్ ప్రసాద్.
22 ఏళ్ల యువతి దారుణ హత్య ఘటన అయోధ్యలోని మికిపుర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగింది. కెనాల్ లో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె రాత్రి సమయంలో మతపరమైన సమావేశానికి వెళ్లింది. కానీ, ఇంటికి తిరిగి రాలేదు. దాంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
యవతి కోసం వెతుకుతూ ఉండగా.. కెనాలో ఆమె మృతదేహం కనిపించింది. తమ కూతురి ఒంటిపై దుస్తులు లేవని, ఆమె కళ్లు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శరీరంపై తీవ్ర గాయాలైన గుర్తులు ఉన్నాయని, కాళ్లను తాళ్లతో కట్టి ఉంచారని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నామని వారు తెలిపారు.
Also Read : అయ్యో పాపం.. ఈ అవ్వకి ఎంత కష్టం వచ్చింది..! జైల్లో ఉండేందుకు నేరాలు చేస్తుందట..
యువతి ఘటనపై పోలీసులు స్పందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి పంపామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక అందుకు అనుగుణంగా దర్యాఫ్తు చేపడతామన్నారు. కాగా, యువతి మృతదేహం కెనాల్ లో కనిపించిందని, ఒంటిపై దుస్తులు లేవని, తాళ్లతో కట్టేసి ఉందని, ఎముకలు విరిగిపోయి ఉన్నాయని మృతురాలి బంధువులు వాపోయారు. అత్యంత దారుణంగా యువతిని చంపేశారని ఆరోపించారు.