Viral Video Ice Forms On Shivling At Nashik’s Trimbakeshwar Temple, People Call It Miracle
Viral Video : ప్రసిద్ధ శివాలయంలో మహా అద్భుతం జరిగింది. శివలింగంపై మంచు కనిపించింది. శివలింగంపై మంచును చూసిన పూజారులు, భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఆ శివమహేమనంటూ విశ్వసిస్తున్నారు. ఈ అద్భుతమైన ఘటన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ప్రసిద్ధ త్రయంబకేశ్వర ఆలయంలో జరిగింది.
ఆలయంలో శివలింగానికి పూజారి పూలతో అర్చన చేశారు. అభిషేకం సమయంలో శివలింగంపై తెల్లగా మంచు ఏర్పడింది. వెంటనే పూజారి పూలను తీసి చూడగా.. నిజంగానే శివలింగంపై మంచు ఉంది. ఆ మంచుగడ్డను పూజారి చేతితో తడిమి చూసి ఆశ్చర్యపోయాడు. ఇదంతా ఆ శివయ్య లీలలే అంటూ స్వామికి పూజను కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నరేంద్ర అహోర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
त्र्यंबकेश्वर मंदिर ज्योतिर्लिंगातील महादेवाच्या स्वयंभू शिवलिंगात बर्फ गोठला हा एक नैसर्गिक चमत्कार आहे, तो कधीच घडला नाही अमरनाथ यात्रेला आजपासून सुरुवात झाली असून, त्र्यंबकराजमध्ये देवानेच भक्तांना दर्शन दिल्याची लोकांची श्रद्धा आहे. ❤️? pic.twitter.com/XVFf6VXGuU
— Narendra Aher ? (@aher_narendra) July 1, 2022
జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహలో అమరేశ్వర్ మహాదేవ్ రూపంలో మంచు శివలింగం ఉంటుంది. ఈ మహాశివుడిని దర్శించుకునేందుకు ప్రతి ఏడాదిలో వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. కరోనా కారణంగా పవిత్ర అమర్ నాథ్ యాత్ర రెండేళ్ల విరామం తర్వాత మొదలైంది. జూన్ 30న ప్రారంభమైన ఈ యాత్ర సమయంలో త్రయంబకేశ్వర ఆలయంలోని శివలింగంపై మంచుగడ్డ ఏర్పడటమనేది మహా అద్భుతమని, అది శివుని మహిమే అని నెటిజన్లు అంటున్నారు.
Read Also : Viral Video: ఆమె 73ఏళ్ల వృద్ధురాలు కాదు.. 73ఏళ్ల యంగ్ లేడీ.. ఈ వీడియోచూస్తే మీరూ అలానే అంటారు..