Viral Video: హాయిగా నవ్వుతూ బ్యాడ్మింటన్ ఆడిన లాలూ ప్రసాద్ యాదవ్

సింగపూర్ లో లాలూ గత ఏడాది డిసెంబరు 5న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

Lalu Prasad Yadav

Viral Video – Lalu Prasad Yadav: బిహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (75) హాయిగా నవ్వుతూ బ్యాడ్మింటన్ (badminton) ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఇన్‍‌‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అలాగే, ఈ వీడియోను ఓ పాత హిందీ పాటను కూడా కలిపి వినిపించారు. ‘‘ భయపడడం నేర్చుకోలేదు. తల వంచడం నేర్చుకోలేదు. పోరాడారు.. పోరాడుతూనే ఉంటారు.. జైలుకి భయపడరు.. చివరకు గెలుస్తారు ’’ అని తేజస్వీ రాసుకొచ్చారు. అవినీతి కేసుల్లో నేరం రుజువై లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే.

దాదాపు ఏడు నెలల పాటు ఆయన బిహార్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. సింగపూర్ లో గత ఏడాది డిసెంబరు 5న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన భారత్ తిరిగి వచ్చారు. అనంతరం ఢిల్లీలోని తన పెద్ద కూతురు మీసా భారతి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. పశుదాణా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బెయిల్ దక్కింది.

Andhra Praedesh : ఫేస్ బుక్ కలిపింది ఇద్దరిని .. చిత్తూరు యువకుడిని పెళ్లాడిన శ్రీలంక యువతి