Maharashtra Revenue Minister Radhakrishna Vikhe Patil
Viral Video – Radhakrishna Vikhe Patil: మహారాష్ట్ర (Maharashtra) రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌పై ఓ వ్యక్తి పసుపు చల్లి కలకలం రేపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రాధాకృష్ణ విఖే వద్దకు ధాంగర్ సామాజిక వర్గానికి సంబంధించిన సభ్యులతో కలిసి ఇవాళ ఓ వ్యక్తి వచ్చాడు. ధాంగర్ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ మరో వ్యక్తితో కలిసి మంత్రికి లేఖ ఇచ్చాడు. రాధాకృష్ణ ఆ లేఖను చదువుతున్న సమయంలో ఆ వ్యక్తి జేబులో నుంచి పసుపు ప్యాకెట్ తీసి మంత్రిపై దాన్ని చల్లాడు.
దీంతో అతడిని రాధాకృష్ణ అనుచరులు పక్కకు లాగారు. అతడిని కిందపడేసి కొట్టారు. అయినప్పటికీ అతడు రిజర్వేషన్లు కావాలంటూ నినాదాలు చేశాడు. రాధాకృష్ణ తల పసుపుతో నిండిపోయింది. సోలాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి పేరు శేఖర్ బంగాలేగా పోలీసులు గుర్తించారు. తమ వర్గానికి చెందిన ప్రజల ఇబ్బందులపైకి ప్రభుత్వం దృష్టిని మళ్లించడానికే ఇలా చేశానని శేఖర్ బంగాలే చెప్పాడు. తనపై పసుపు చల్లినందుకు తానేం బాధపడడం లేదని రాధాకృష్ణ అన్నారు.
पवित्र भंडारा अंगावर उधळला तर मारहाण करावी लागते का..?? हेच का भाजपा चे हिदुत्व..?? pic.twitter.com/x9RgAkOq7x
— Shilpa Bodkhe – प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) September 8, 2023
Revanth Reddy : నేను పీసీసీ చీఫ్ అయ్యాకే తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రాధాన్యత పెరిగింది : రేవంత్ రెడ్డి