Viral Video: వామ్మో.. రోడ్డుపై వెళ్తున్న బైకర్‌ను వెంటాడి కింద పడేసి చంపేసిన ఖడ్గమృగం

బయటకు వచ్చిన ఖడ్గమృగం అతడిని వెంటాడింది. దీంతో అతడు బైకును పక్కకు..

రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్‌ను వెంటాడి కింద పడేసి చంపేసింది ఓ ఖడ్గమృగం. ఈ ఘటన అసోంలోని మోరిగావ్ జిల్లాలో పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం వద్ద చోటుచేసుకుంది. బాధితుడు సద్దాం హుస్సేన్ (37) ఘటనాస్థలికి 30 కిలోమీటర్ల దూరంలోని కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో ఉంటాడు.

అతడు తన బైక్‌పై ప్రయాణిస్తుండగా, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఖడ్గమృగం అతడిని వెంటాడింది. దీంతో అతడు బైకును పక్కకు తిప్పినప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రోడ్డుకి ఓ వైపున అతడి బైకు వెళ్లి కింద పడిపోయింది. సద్దాం హుస్సేన్‌ రోడ్డుపై నుంచి పక్కకు పరుగులు తీశాడు.

అయినప్పటికీ అతడిని ఖడ్గమృగం వదలకుండా వెంటాడింది. ఆ తర్వాత అతడిపై దాడి చేసి చంపేసింది. అక్కడున్న వారు ఈ ఘటనను చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ భారీ ఖడ్గమృగాన్ని బెదిరించడానికి స్థానికులు ఎంతగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది.

30వేల మంది భారతీయులు మిస్సింగ్..! వారంతా ఏమయ్యారు? ఆందోళనకు గురిచేస్తున్న సైబర్ స్లేవరీ..