Narveer Singh Gill
Viral Video: ఓ యువకుడిని మెకాళ్లపై కూర్చోబెట్టి, అతడి మెడను పట్టుకుని పంజాబ్ పోలీసులు హింసించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాధిత యువకుడి పేరు నరవీర్ సింగ్ గిల్. అతడు పంజాబ్ యూనివర్సిటీ(Panjab University )కి చెందిన విద్యార్థి.
నరవీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తనను పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధావా కుమారుడు ఉదయ్ వీర్ సింగ్ రంధావా కొట్టాడని చెప్పాడు. దీనిపై చండీగఢ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ కు సెక్యూరిటీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులే నరవీర్ సింగ్ గిల్ ను హింసించినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
నరవీర్ సింగ్ గిల్, ఉదయ్ వీర్ సింగ్ ఆగస్టు 23న ఓ రెస్టారెంటు వద్ద ఉన్న సమయంలో గొడవ జరిగింది. తనను కొడుతున్న సమయంలో ఉదయ్ వీర్ సింగ్ వీడియో తీశాడని గిల్ తెలిపాడు. ‘ నువ్వు నన్ను మూడేళ్లుగా హింసిస్తున్నావు ’ అని ఉదయ్ వీర్ సింగ్ అన్నట్లు ఈ వీడియోలో వినపడుతోంది.
ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. విద్యార్థిని కొట్టిన ఘటన పంజాబ్ లో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఉదయ్ వీర్ సింగ్ ను అరెస్టు చేయాలని అకాలీ దళ్ డిమాండ్ చేసింది. అలాగే, బాధితుడిని కొట్టిన పోలీసులపై కేసు నమోదు చేయాలని అంటోంది.
PU law student, Narveer Gill, who accuse Udhayveer Singh Randhawa, son of former DyCM Punjab, SukhjinderSinghRandhawa, for assaulting him Vice-versa released purported video. He was seen squatted by Punjab cops and being kicked on his downed head
(Note: objectionable language) pic.twitter.com/7CSiVuVuGa— saurabh prashar (@saurabhprashar2) August 30, 2023