Viral Video: ట్రాఫిక్ జామ్‌ అవుతున్నా పట్టించుకోకుండా.. నడిరోడ్డుపై వాహనదారుల ఫైటింగ్‌

కారులో చిన్నపిల్లలు ఉన్నప్పటికీ, వారు ఏడుస్తున్నప్పటికీ గొడవ పడడం గమనార్హం.

దేశంలోని రోడ్లపై ప్రతిరోజు ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల గుంతలమయమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, రోడ్లపై చాలా మంది చేసే స్టంట్ల వల్ల చాలా మందికి అసహనం కలుగుతుంది. అసలే చాలా చోట్ల రోడ్లు గుంతలమయంగా ఉంటాయంటే కొందరు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘిస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

ఇటువంటి వారి వల్ల రోడ్లపై గొడవలు జరుగుతుంటాయి. ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. తప్పుడు పద్ధతిలో ఓవర్ టేక్ చేశావంటూ ఓ కారు డ్రైవర్‌ను ఓ బైకర్ గొడవపడ్డాడు. ప్రమాదకరరీతిలో ఓవర్‌టేక్ చేశావంటూ కారు డ్రైవర్‌తో దుర్భాషలాడాడు.

ఇతర ప్రయాణికులు ఇందులో జోక్యం చేసుకుని ఆ బైకర్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ బైకర్‌ వెనక్కి తగ్గలేదు. కారు డ్రైవర్‌ను లాగిపెట్టి కొట్టాడు. దీంతో కారు డ్రైవర్‌ కారు దిగి ఆ బైకర్‌తో గొడవపడ్డాడు. ఆ కారులో చిన్నపిల్లలు ఉన్నప్పటికీ, వారు ఏడుస్తున్నప్పటికీ గొడవ పడడం గమనార్హం. ఈ తతంగాన్నంతా వెనుక వచ్చిన మరో బైకర్‌ వీడియో తీశాడు. ఈ ఘటన జరిగిన తేదీ, స్థలం గురించి వివరాలు తెలియరాలేదు.

Sajjala: లుక్‌అవుట్ నోటీసు ఇస్తే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఇస్తారు.. వీరు మాత్రం తిరిగి వస్తున్నప్పుడు ఇచ్చారు: సజ్జల