డబ్బు, అధికారం మనుషులకు పొగరు పట్టిస్తాయి. ఆ రెండు మన పక్కన ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరన్న వెర్రిని మెదడులోకి ఎక్కిస్తాయి. ఓ యువకుడు తన వద్ద డబ్బు ఉందని, తన తండ్రి పోలీసు అధికారి అన్న పొగరుతో ఇష్టం వచ్చినట్లు వీడియోలు తీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు. ఆ యువకుడి వీడియోల్లో అతడి తండ్రి కూడా కనపడుతుండడం గమనార్హం.
రక్షిత్ బెనివాల్ అనే యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 41,000 మందికి పైగా ఫాలోయింగ్ ఉంది. అలాగే, 70,000 యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. అతడి తండ్రి ఓ పోలీసు అధికారి. రక్షిత్ రద్దీగా ఉండే రహదారిపై మహీంద్రా థార్ పై హాయిగా కూర్చొని ప్రయాణిస్తూ వీడియో తీసుకున్నాడు. అతని కారు చుట్టూ ఇతర జీపులు కూడా ఉన్నాయి.
పోలీసు యూనిఫారంలో ఉన్న అతని తండ్రి వాహనం లోపల కూర్చున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోను రక్షిత్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాక అది విపరీతంగా వైరల్ అవుతోంది. తనను రక్షించడానికి తన తండ్రి ఉన్నాడని కూడా రక్షిత్ క్యాప్షన్ ఇచ్చాడు. కొంచం కూడా భయం లేకుండా అటువంటి వీడియోలు తీస్తున్న రక్షిత్‌ను అరెస్టు చేయాలని, అతడిని ప్రోత్సహిస్తున్న అతడి తండ్రిపై కూడా కేసు నమోదు చేయాలని నెటిజన్లు మండిపడుతున్నారు.