విరసం నేత వరవరరావుకు అస్వస్థత ..జేజే ఆస్పత్రికి తరలింపు

  • Publish Date - May 30, 2020 / 05:03 AM IST

విరసం నేత..ప్రముఖ కవి వరవరరావు అస్వస్థతకు గురయ్యారు.+ఎనభై ఏళ్ల వయసులో ఆయనను ప్రభుత్వం జైలులో ఉంచింది. ముంబైలోని తలోజా జైలులో ఉన్న ఆయనను నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వరవరరావు అనారోగ్య సమాచారాన్ని చిక్కపడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు అందించినట్టు పుణె పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు, ఎల్గార్‌ పరిషద్‌– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు.గత కొద్ది రోజులుగా తన తండ్రికి బెయిల్ ఇవ్వాలని ఆయన కుమార్తెలు కేంద్ర,మహరాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నవీముంబైలోని జేజే హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. నవీ ముంబైలోని సెంట్రల్‌ జైల్లో ఏడాదిన్నరగా విచారణ ఖైదీగా ఉన్న ఆయన అస్వస్థతకు గురి కావటంతో చికిత్స నిమిత్తం ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు.  వయస్సు రీత్యా వచ్చే  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనీ..పైగా కరోనా వైరస్ కల్లోలంగా ఉన్న క్రమంలో ఆయన్ని విడుదల చేయాలని ఆయన భార్య హేమలత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

అస్వస్థతగా ఉన్న ఆయనకు గత మూడు రోజులు నుంచీ జైల్లోనే వైద్యం అందిస్తున్నారు. కాగా..మరింతగా ఆరోగ్యపరిస్థితి ఉండటంతో గురువారం సాయంత్రం ఆయన కళ్లు తిరిగిపడిపోయారు. ఆస్పత్రిలో ఆయన ఛాతీకి ఎక్స్‌రే తీశారు. కరోనా పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు చేశారు. వీటి ఫలితాలు శనివారం వస్తాయని..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని..డాక్టర్లు చెప్పారు.ఆస్పత్రిలో ఉన్న వరవరరావును చూసేందుకు ఆయన భార్య హేమలత, కుమార్తె పవన శనివారం ముంబైకి వచ్చారు. 

రక్తపోటుతో పాటు పలు అనారోగ్యసమస్యలతో ఆయన బాధపడుతున్నారనీ..బెయిల్ పై విడుదల చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క అనారోగ్యం కారణంగా తనకు బెయిల్‌ మంజూరు చేయాలని వరవరరావు ముంబైలోని స్పెషల్‌ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ పిటిషన్‌ను జూన్‌ 2కు వాయిదా వేశారు. 

Read: మావోయిస్టులకు రక్తదానం చేసిన జావాన్లు : సెల్యూట్ సైనికా

ట్రెండింగ్ వార్తలు