హస్తం గుర్తుకే ఓటు వేయండి….బీజేపీ ర్యాలీలో నోరు జారిన సింథియా

Vote for the hand, vote for Cong…’: BJP’s Jyotiraditya Scindia మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ప్రచారంలో జోతిరాదిత్య సింథియా జోతిరాదిత్య సింథియా. శనివారం దర్భాలో బీజేపీ అభ్యర్థి తరపున ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సింధియా… హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ పేరునూ ప్రస్తావించబోయి ఆగిపోయారు. వెంటనే తన పొరపాటును గ్రహించి బీజేపీకి ఓటేయండి అని చెప్పుకొచ్చారు. ఇది విని పక్కన ఉన్న అభ్యర్థి చిరునవ్వులు చిందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



కాగా, ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింథియా వర్గంలోని 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రాజీనామా చేసి.. బీజేపీకి జై కొట్టడంతో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి..శివారాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. వాటిటోపాటు మరో ఆరుస్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 28స్థానాలకు నవంబర్-3న ఉపఎన్నికలు జరుగనున్నాయి.