ముస్లింలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ…ముస్లింలందరూ తనకే ఓటు వేయాలని… లేకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు.
కేంద్రమంత్రి మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం (ఏప్రిల్-11,2019) ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ టౌన్ లోని తురబ్ ఖానీ ఏరియాలో ముస్లింలతో జరిగిన సమావేశంలో మేనకా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ…ముస్లింలందరూ తనకే ఓటు వేయాలని… లేకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు. ఓటు వేయకుండా ఉద్యోగాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
Read Also : EVMలు బ్యాన్ చెయ్యాలి : చంద్రబాబు సంచలన డిమాండ్
ఇది ఇచ్చి పుచ్చుకునే పద్ధతి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.తాను ఇప్పటికే ఈ ఎన్నికల్లో విజయం సాధించానని,ఇక నిర్ణయించుకోవాల్సింది మీరే అంటూ ముస్లింలను ఉద్దేశించి ఆమె అన్నారు.ముస్లింల మద్దతు లేకుండా తాను ఎన్నిక కావాలనుకోవడం లేదన్నారు.మేనక చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 3నిమిషాల నిడివిగల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేనక వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.2014లో పిలిభిత్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మేనక విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో తన సిట్టింగ్ సీటుని కొడుకు వరుణ్ గాంధీకి అప్పగించి ఆమె సుల్తా పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
Read Also : వాయిస్ సెర్చ్ చేశారా.. మీ గుట్టు అమెజాన్ చేతిలో ఉన్నట్లే