×
Ad

Cloud Seeding Video: అరె భలే ఉందే.. ఢిల్లీలో కృత్రిమ వాన కురిపించడానికి ఏం చేస్తున్నారో చూడండి..

క్లౌడ్‌ సీడింగ్‌ అంటే మేఘాలలో రసాయనాలను చల్లి వర్షం కురిపించే సాంకేతిక విధానం.

Cloud Seeding

Cloud Seeding Video: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ చేశారు. కృత్రిమంగా వాన కురిపించడానికి రెండు దశల్లో ట్రయల్స్‌ పూర్తయ్యాయి. క్లౌడ్‌ సీడింగ్‌ అంటే మేఘాలలో రసాయనాలను చల్లి వర్షం కురిపించే సాంకేతిక విధానం.

Also Read: Montha Cyclone: తెలంగాణకు రెడ్ అలర్ట్‌.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..

“ఐఐటీ కాన్పూర్‌ ద్వారా సెస్‌నా విమానం సాయంతో ఢిల్లీలో రెండో క్లౌడ్‌ సీడింగ్‌ పరీక్ష జరిగింది. విమానం మీరట్‌ దిశ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. ఖేక్రా, బురారి, నార్త్‌ కరోల్‌ బాగ్‌, మయూర్‌ విహార్‌ ప్రాంతాల మీదుగా వెళ్లింది. క్లౌడ్‌ సీడింగ్‌లో ఎనిమిది ఫ్లేర్స్‌ వాడారు.

ప్రతి ఫ్లేర్‌ బరువు 2-2.5 కిలోల మధ్య ఉంటుంది. ఈ ఫ్లేర్స్‌ మేఘాలలో కంటెంట్ (రసాయన పదార్థాన్ని)ను విడుదల చేశాయి. మేఘాలలో తేమ 15-20% ఉంది. ఈ ప్రక్రియ అరగంట కొనసాగింది. ఈ సమయంలో ఒక ఫ్లేర్‌ 2-2.5 నిమిషాలు పనిచేసింది” అని ఢిల్లీ మంత్రి మజిందర్‌ సింగ్‌ సిర్సా చెప్పారు. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షాలు కురవనున్నాయి.

ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ అత్యంత దిగజారడంతో క్లౌడ్ సీడింగ్ చేపట్టారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. సీడింగ్ ద్వారా మేఘాల నుంచి వర్షాన్ని తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేఘాలు దట్టంగా లేకపోతే సీడింగ్ ఫలితం తక్కువగా ఉంటుంది.