Cheetahs Inside Boeing: బోయింగ్ విమానంలో చీతాల్ని ఎలా తరలించారో చూశారా.. వీడియో షేర్ చేసిన రవీనా టాండన్

చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకురావడానికి కేంద్రం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. పూర్తి భద్రతా చర్యల మధ్య బోయింగ్ 747 విమానంలో చీతాల్ని ఇండియా తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ నటి రవీనా టాండన్ షేర్ చేసింది.

Cheetahs Inside Boeing: నమీబియా నుంచి భారత ప్రభుత్వం ఎనిమిది చీతాల్ని ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులోకి విడుదల చేశారు.

Pregnant Woman: గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన రికవరీ ఏజెంట్.. ట్రాక్టర్ లోన్ కట్టలేదని ఘాతుకం

ఈ సందర్భంగా చాలా మంది ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెబుతూనే, చీతాల్ని తీసుకురావడంపై అభినందనలు కూడా చెబుతున్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా చేరారు. చీతాల్ని దేశం తీసుకురావడానికి ప్రత్యేక బోయింగ్ విమానాన్ని కేంద్రం ఉపయోగించిన సంగతి తెలిసిందే. బోయింగ్ 747 విమానంలో చీతాల్ని దేశానికి తరలిస్తున్నప్పటి వీడియోని రవీనా టాండన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

RTO Services Online: ఆర్‌టీఓ సేవలు ఇకపై ఆన్‌లైన్‌లోనే.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

అత్యంత పెద్ద విమానాల్లో ఒకటైన బోయింగ్ 747లో చీతాల్ని ప్రత్యేక బోన్లలో బంధించారు. వాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మరి వాటిని ఎలా తీసుకొచ్చారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

 

ట్రెండింగ్ వార్తలు