Snake Rescue
Snake Rescue : స్కూటర్ లో దాగున్న పాముని పట్టుకునేందుకు ఓ స్నేక్ క్యాచర్ చేసిన ప్రయత్నం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పాముని పట్టేందుకు అతడు వాడిన వస్తువు, ఆ విధానం షాక్ కి గురి చేస్తుంది. వామ్మో.. పాముని ఇలా కూడా పట్టుకుంటారా? అని ఆశ్చర్యం కలగక మానదు.
ఓ స్కూటర్ లో కింగ్ కోబ్రా దాక్కుంది. ఈ విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి వచ్చాడు. పెద్ద వాటర్ కంటైనర్ తో పాముని పట్టుకున్నాడు. అతడు పాముని పట్టుకున్న విధానాన్ని అక్కడ చుట్టూ చేరిన వారు తమ మొబైల్ లో షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Neem : వేపతో చుండ్రు నుండి జుట్టు సంరక్షణ ఎలాగంటే!..
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోని ట్వీట్ చేశారు. కాగా, ఓ ఏడాది కాలంగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బండి మీదున్న నెంబర్ ప్లేట్ ఆధారంగా ఈ ఘటన తెలంగాణలో జరిగినట్లు తెలుస్తోంది.
ఈ క్లిప్ 2 నిమిషాల 7 సెకన్ల నిడివితో ఉంది. కింగ్ కోబ్రా తలని పైకెత్తింది. తనను పట్టుకునేందుకు తనవైపు వచ్చిన స్నేక్ క్యాచర్ ను కాటేసేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన అతడు వెంటనే వెనక్కి వెళ్లాడు. అప్రమత్తంగా వ్యవహరించాడు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ పెద్ద వాటర్ కంటైనర్ ను తీసుకొచ్చాడు. పలు నిమిషాల ప్రయత్నం తర్వాత అతడు సక్సెస్ అయ్యాడు. పాముని బంధించాడు. పామూ పూర్తిగా వాటర్ కంటైనర్ లోకి వెళ్లాక అది పారిపోకుండా దానికి మూత పెట్టేశాడు.
Diabetes : షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా… ఎలాంటి పండ్లు తినాలంటే?
”వర్షాకాలంలో ఇలాంటి అతిథులు సహజమే, కానీ దాన్ని పట్టుకున్న విధానం అసహజం. దీన్ని ఎప్పుడూ ప్రయత్నించకండి’’ అని నంద హెచ్చరించారు. ఆ స్నేక్ క్యాచర్ ఎంతో సాహసం చేశాడు. అసలు అలా వాటర్ కంటైనర్ తో పాము పట్టుకోవాలని చూడటం ప్రాణాంతకం. అతడు ఎలాగో సక్సెస్ అయ్యాడు. కానీ మీరు మాత్రం.. పొరపాటున కూడా ఇలాంటి ప్రయత్నం ఎన్నడూ చేయొద్దని తన ఫాలోవర్లను హెచ్చరించారు నంద.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ లో ఈ వీడియోని సుమారుగా 15వేల సార్లు వీక్షించారు. నెటిజన్లు ఈ వీడియోపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కొంతమంది ఇది భయంకరంగా ఉందని చెప్పగా.. మరికొందరు ఆ పాముకు వాటర్ టిన్నులో ఊపిరందుతుందా? అని ప్రశ్నించారు. స్నేక్ క్యాచర్ వైఖరిని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. పాముని పట్టే విధానం కరెక్ట్ కాదన్నారు. అయితే, ఆ వ్యక్తి చాలా ఎక్స్ పర్ట్ అని, ఇదే తరహాలో అతడు కొన్ని వేల పాములని కాపాడాడని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు.
Such guests during rains are common…
But uncommon is the method used to rescue it. Never ever try this? pic.twitter.com/zS4h5tDBe8— Susanta Nanda IFS (@susantananda3) September 7, 2021