Neem : వేపతో చుండ్రు నుండి జుట్టు సంరక్షణ ఎలాగంటే!..

చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. దీనికి సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే సమస్య తిరిగి పునరావృతమౌతూనే ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. చుండ్రు సమస్యను

Neem : వేపతో చుండ్రు నుండి జుట్టు సంరక్షణ ఎలాగంటే!..

Neem

Neem : చుండ్రుసమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఎన్న షాంపులు వాడినా ఏమాత్రం ప్రయోజనం కనిపించదు. చండ్రు సమస్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ఇలాంటి వారు చుండ్రు సమస్యను పరిష్కరించుకునేందుకు వేప ఓ చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. చుండ్రు సమస్యను నివారించటంతోపాటు జుట్టు ఆరోగ్యంగా, మృధువుగా మారేందుకు వేపాకులు ఎంతగానో ఉపయోగపడతాయి. టైకాలజిస్టు నిపుణులు సైతం వేపాకులతో చుండ్రు సమస్యను సులభంగా తగ్గించవచ్చని స్పష్టం చేస్తున్నారు.

తలపై జట్టు కుదుళ్ళ వద్ద చర్మం పొడిబారిపోయి పొట్టుపొట్టుగా లెగుస్తుంటుంది. దువ్వే సమయంలో దువ్వెనలకు అంటుకుని ఉంటుంది. జుట్టు పైభాగంలో తెల్లగా కనిపిస్తూ ఎబ్బేట్టుగా ఉంటుంది. చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ నలుగురిలో తిరగలేక ఇబ్బందులు పడుతుంటారు. తరచు తలలో జిల కలగటం..దీంతో గోక్కుంటూ ఉంటారు. చుండ్రు తలపై భాగంలోనేకాక దాని వల్ల శరీరం మొత్తం దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఇది మలస్సేజియా అనే శిలింధ్రాల జాతికి చెందిన ఫంగస్‌ కారణంగా చర్మంపై వస్తుంది. దీని జీవితకాల పరిమితి అతిస్వల్పమైనప్పటికీ వేగంగా పెరగడం, విస్తృతంగా వ్యాపించడం దీని గుణం.

చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. దీనికి సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే సమస్య తిరిగి పునరావృతమౌతూనే ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. చుండ్రు సమస్యను పరిష్కరించటంలో వేప చక్కగా పనిచేస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే దివ్యౌషధం. ఏ ఋతువులోనైనా అందుబాటులో ఉంటుంది. అనేక చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను తొలగించటంలో వేపను మించింది లేదు. రక్తశుద్ధీకరణతో పాటు యాంటీ మైక్రోబయల్‌ కారకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఫంగల్‌ , యాంటీ వైరల్‌ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ దోహదపడుతుంది.

చుండ్రు నుంచి సులువుగా ఉపశమనం పొందాలంటే రోజూ ఉదయం నాలుగైదు వేప ఆకులు తినాలి. చేదును తప్పించుకోవడానికి కొంచె తేనె జోడించి తింటే సరి. వేపాకులను మరిగించి కషాయం రూపంలో కూడా తాగవచ్చు. వేప నూనెను ఇంటిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులు వేసి మరిగించిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మ రసం చేర్చితే వేప నూనె సిద్ధమౌతుంది. రాత్రి సమయంలో నూనెతో తలను బాగా మర్ధనాచేసుకోవాలి. మరునాడు ఉదయాన్నేతలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ నూనెను తలకు పట్టించిన తర్వాత ఎండలోకి వెళ్లకపోవడం బెటర్‌. నూనెలోని నిమ్మరసం సూర్యరశ్మి వల్ల జుట్టుకు హాని కలగచేయవచ్చు.

పెరుగుకలిపిన వేపాకును తలకు పట్టించటం ద్వారా చుండ్రు సమస్యకు కళ్లెం వేయవచ్చు. ముందుగా వేపాకును పేస్టులా చేసుకుని, ఒక గిన్నె పెరుగులో కలుపుకుని మాడు మొత్తానికి పట్టించి, 15-20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్‌ లక్షణాలు, పెరుగులోని చల్లదనం చుండ్రును నివారించడమే కాకుండా కుదుళ్లను పఠిష్టం చేస్తాయి. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా , మెరిసేలా చేస్తుంది.

డాండ్రఫ్‌ నివారణ పద్ధతుల్లో వేప హెయిర్‌ మాస్క్‌ ను కూడా ట్రై చేయవచ్చు. కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను దానికి కలపాలి. దీనిని హెయిర్‌ మాస్క్‌లా మాడు భాగం మొత్తానికి పట్టించి 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. జుట్టు ఆరిపోయాక ఫలితం మీకే తెలుస్తుంది. తలస్నానానికి ముందు లేదా తర్వాత వాడినా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఎలాచేయాలంటే.. కొన్ని వేపాకులను తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత చల్లారనివ్వండి. షాంఫుతో తలస్నానం చేశాక, ఈ వేప మిశ్రమంతో తలను కడిగినా మంచి ఫలితం ఉంటుంది.

వేపతో తయారు చేసిన షాంపుతో వారానికి రెండూ , మూడు సార్లు తలస్నానం చెస్తే సరిపోతుంది. సాధారణంగా చుండ్రు సమస్య నివారణకు వేపతో తయారుచేసిన షాంపులను వాడాల్సిందిగా నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే చుండ్రు నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి. వేపలోని ఔషధ గుణాలు అన్నిరకాల జుట్టు సంబంధిత సమస్యలను నివారిస్తాయి. జుట్టు ఆరోగ్యంతోపాటు, చుండ్రు నివారణకు వేపఅద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.