Bigg Boss Telugu 9: బిగ్ బాస్ సీజన్ 9.. ఆరంభం అదుర్స్.. కంటెస్టెంట్స్ వీరే.. చివరలో ఊహించని ట్విస్ట్..
బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్స్ ఎవరెవరు? వారి స్పెషాలిటీ ఏంటి? వారినే హౌస్ లోకి ఎందుకు పంపారు?

Bigg Boss Telugu 9: ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అదుర్స్ అనిపించింది. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అనే నినాదంతో సీజన్ 9కి స్వాగతం పలికారు నాగార్జున. సీజన్ 9లో సెలబ్రిటీలు, సామాన్యులు మధ్య పోరు జరగనుంది. మొదటి ఎపిసోడ్‌తోనే ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించారు.
బిగ్ బాస్ సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఆరుగురు కామనర్స్ ఉన్నారు. 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. చివరలో ట్విస్ట్ ఇచ్చారు. ముందు నుంచి చెబుతున్నట్లే ఈసారి రెండు హౌస్ లు ఉండగా.. మెయిన్ హౌస్ ని కామనర్స్ కి కేటాయించారు. ఆల్రెడీ అగ్ని పరీక్ష గెలిచి వచ్చారు కాబట్టి, వారిని ఓనర్స్ గా పేర్కొన్నారు. సెలబ్రిటీలు అవుట్‌హౌస్‌లో ఉంటారని నాగార్జున తెలిపారు.
మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇది ఆడియన్స్ కి సర్ ప్రైజ్ అని చెప్పాలి. 14 మందితో ఫైనల్ చేసినప్పటికీ శ్రీముఖి రిక్వెస్ట్ మేరకు కామనర్స్ నుంచి మరో కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపారు నాగార్జున. అభిజిత్, శ్రీముఖి నిర్ణయం మేరకు కామనర్ మర్యాద మనీష్ ని ఎంపిక చేశారు. మొత్తంగా బిగ్ బాస్ హౌస్ లోకి 15 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. రాబోయే రోజుల్లో సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య జరిగే సమరం మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తొలి కంటెస్టెంట్.. తనూజ..
బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ సెలెబ్రిటీ కంటెస్టెంట్ తనూజ. ఈమె సీరియల్ నటి. ముద్ద మందారం సీరియల్ తో గుర్తింపు పొందారు. జరగండి జరగండి అనే పాటకు డ్యాన్స్ తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు తనూజ.
సెకండ్ కంటెస్టెంట్.. ఆశా సైనీ
హౌస్ లో అడుగు పెట్టిన రెండో సెలెబ్రిటీ కంటెస్టెంట్ ఆశా సైనీ. నటి, ఒకప్పటి హీరోయిన్. తన అసలు పేరు ఆశా సైనీ కాదని ఫ్లోరా సైనీ అని ఆమె చెప్పారు. నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాపగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
మూడో కంటెస్టెంట్.. ఫస్ట్ కామనర్.. జవాన్ కల్యాణ్
ఇద్దరు సెలబ్రిటీలు హౌస్ లోకి ఎంటర్ అయ్యాక.. మూడో కంటెస్టెంట్ గా ఒక కామనర్ ఎంట్రీ ఇచ్చారు. కామనర్స్ లో తొలి కంటెస్టెంట్ కల్యాణ్ హౌస్ లోకి వెళ్లారు. ఇద్దరు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ తర్వాత కామనర్ ని కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేశారు. ఈయన ఒక సోల్జర్.
4వ కంటెస్టెంట్.. జబర్దస్త్ ఇమ్మాన్యుయల్..
నాలుగో కంటెస్టెంట్ గా ఇమ్మన్యుయల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన కమెడియన్. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు.
5వ కంటెస్టెంట్.. శ్రష్టి వర్మ
5వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రష్టి వర్మ. ఈమె డ్యాన్సర్, లేడీ కొరియోగ్రాఫర్. ఢీ షోతో పాపులర్ అయ్యారు. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. జానీ మాస్టర్ వివాదంతో బాగా పాపులర్ అయ్యారు.
6వ కంటెస్టెంట్.. కామనర్ మాస్క్ మ్యాన్
హౌస్ లోకి 6 కంటెస్టెంట్ గా రెండో కామనర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే మాస్క్ మ్యాన్ హరీశ్. అగ్ని పరీక్ష జ్యురీ మెంబర్ బిందు మాధవి హరీశ్ ని ఎంపిక చేశారు.
7వ కంటెస్టెంట్.. భరణి
7వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టారు భరణి. ఈయన టీవీ నటుడు. విలన్ గా మెప్పించారు.
8వ కంటెస్టెంట్.. రీతూ చౌదరి
హౌస్ లోకి 8వ కంటెస్టెంట్ గా రీతూ చౌదరి అడుగు పెట్టింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్ గా గుర్తింపు పొందింది. జబర్దస్త్ షోలోనూ మెరిసింది. టీవీ షోల్లోనూ అలరిస్తోంది. బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. తన అసలు పేరు దివ్య అని రివీల్ చేసింది. అయితే, రీతూ చౌదరిగా మార్చుకున్నాని, అందుకు కారణం ఏంటో స్టేజ్ పై చెప్పింది.
9వ కంటెస్టెంట్.. కామనర్ డిమోన్ పవన్
9 కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టిన మూడో కామనర్ డిమోన్ పవన్. ఈయనని స్వయంగా హోస్ట్ నాగార్జున ఎంపిక చేయడం విశేషం.
10వ కంటెస్టెంట్.. సంజన గల్రానీ
10వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు సంజన గల్రానీ. ఈమె సినీ నటి. బుచ్చిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
11వ కంటెస్టెంట్.. రామూ రాథోడ్
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన 11వ కంటెస్టెంట్ రామూ రాథోడ్. పల్లె పాటలతో ఫోక్ సాంగ్ ప్రియులను ఆకట్టుకున్నారు. రాను బొంబాయికి రాను’ అనే సాంగ్ తో పాపులారిటీ సంపాదించుకున్నారు. తాను పాడిన ఆ ఫేమస్ సాంగ్ తోనే ఎంట్రీ ఇచ్చారు.
12 కంటెస్ట్.. కామనర్ శ్రీజ దమ్ము
12వ కంటెస్ట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు మరో కామనర్ శ్రీజ దమ్ము. జ్యురీ జడ్జిమెంట్ కింద నవదీప్.. శ్రీజ దమ్మును కంటెస్టెంట్ గా ఎంపిక చేశారు. దీంతో కామనర్స్ నుంచి 4 కంటెస్టెంట్ గా శ్రీజ దమ్ము బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యారు.
13వ కంటెస్టంట్.. సుమన్ శెట్టి
13వ కంటెస్టెంట్ గా సెలబ్రిటీల నుంచి సుమన్ శెట్టి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. డైరెక్టర్ తేజ జయం సినిమాతో సుమన్ కాస్తా సుమన్ శెట్టి అయ్యానని తెలిపారు. 300 పైగా సినిమాలు చేశాక పెళ్లి చేసుకుని సెటిలైపోయానని తెలిపారు.
14వ కంటెస్టెంట్.. కామనర్ ప్రియా శెట్టి
14వ కంటెస్టెంట్ గా హౌస్ లో కి మరో కామనర్ అయిన ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ప్రియ ముందంజలో ఉండటంతో.. ఫైనల్ కామనర్ కంటెస్టెంట్ గా ప్రియ హౌజ్ లోకి వెళ్లారు. ఆమె డాక్టర్.
15వ కంటెస్టెంట్.. మర్యాద మనీశ్
నిజానికి ఇది ఆడియన్స్ కి సర్ ప్రైజ్. 14 మందితో ఫైనల్ చేసినప్పటికీ శ్రీముఖి రిక్వెస్ట్ మేరకు నాగార్జున కామనర్స్ నుంచి మరో కంటెస్టెంట్ ని హౌస్ లోకి చేశారు. మొత్తంగా హౌజ్ లోకి 15 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు.
తెలుగు బిగ్ బాస్ హోస్టింగ్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, నాని హోస్టులుగా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి నాగార్జున ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓటీటీ సీజన్‌తో కలిపి వరుసగా ఏడోసారి ఆయన ఈ షోకు సారథ్యం వహిస్తున్నారు.