Diabetes : షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా… ఎలాంటి పండ్లు తినాలంటే?

చాలా మంది డయాబెటిక్ రోగులు కార్బోహైడ్రేట్లతో కూడి ఆహారం తీసుకోవటం మంచిదికాదని బావిస్తారు. దీంతో వాటిని తినటం మానేస్తారు. ఇలా చేయటం అన్నది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కార్బోహైడ్ర

Diabetes : షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా… ఎలాంటి పండ్లు తినాలంటే?

Shugar

Diabetes : ఇటీవలి కాలంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఆరోగ్యంగా ఉండటానికి చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ పరిస్ధితుల్లో చక్కెరను ఏప్పటికప్పుడు నియంత్రించుకునేందుకు ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమయం ప్రకారం ఆహారం తీసుకోవటం, మంచి నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండడం, ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వంటివి పాటిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉండి ఆరోగ్యంగా ఉంటారు.

చాలా మంది డయాబెటిక్ రోగులు కార్బోహైడ్రేట్లతో కూడి ఆహారం తీసుకోవటం మంచిదికాదని బావిస్తారు. దీంతో వాటిని తినటం మానేస్తారు. ఇలా చేయటం అన్నది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కార్బోహైడ్రేట్లను తొలగించడానికి బదులుగా, మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలను చేర్చాలి. ఇలా చేయటం వల్ల అనే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పండ్లలో ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధ పడే వారు ఏ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

పండ్లు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లను శరీరానికి అందేంచుకు చక్కగా ఉపయోగపడతాయి. పండ్లలో సహజ చక్కెర ఉంటుంది. ఇందులో విటమిన్లు అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిస్ రోగులు ఆపిల్, ద్రాక్ష, బెర్రీలు, తినవచ్చు. మామిడి, లిచ్చి , చికూ వంటి తక్కువ తీపి పండ్లను తీసుకోవాలి. అవోకాడోస్, జామూన్, కివి పండు, రేగు, మరియు జామ వంటి పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచటంలో బాగా దోహదపడతాయి.

డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ వరకు తీసుకోకుండా ఉండటం మంచిది. మీడియం సైజ్ మామిడిలో 40 నుండి 45 గ్రాముల చక్కెర ఉంటుంది. మీడియం సైజు అరటి పండులో దాదాపు 15 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఎండు ఖర్జూరంలో ఇందులో 4.5 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇవి తీసుకోక పోవడం మంచిది. చక్కెర స్ధాయిలు తక్కువగా ఉండే పండ్లను తీసుకోవటం అన్నది షుగర్ వ్యాధి గ్రస్తులకు కొంతమేర మేలు కలిస్తాయి. వైద్యుల సలహాలను పాటిస్తూ పండ్లను తీసుకోవటం మేలు.