ఆలయ నిర్మాణానికి అనుకూలమే : కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా

  • Publish Date - November 9, 2019 / 07:21 AM IST

వివాదాస్పద రామజన్మభూమి స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును  స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రణ్ దీప్‌ సుర్జేవాలా అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమని తెలిపారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణానికి ద్వారాలు తెరవడమే కాదు బీజేపీ, ఇతర పక్షాలకు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ద్వారాలు మూసుకుపోయాయని ఆయన  వ్యాఖ్యానించారు.