We have decided to remove archaic laws says Kiren Rijiju
Kiren Rijiju: ఎప్పటి నుంచో పేరుకుపోయి, ప్రజలకు అంతగా ఉపయోగంలో లేని పురాతన చట్టాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. శనివారం మేఘాలయలోని షిల్లాంగ్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అనేక చట్టాల వల్ల ప్రజలకు, వ్యవస్థకు అసౌకర్యాలు ఏర్పడుతున్నాయని, అందుకే ఈ చట్టాలను తొలగించి ప్రజలకు ప్రశాంతమైన జీవనం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్నారని ఆయన అన్నారు.
‘‘సాధారణ ప్రజల జీవిన విధానంపై కొన్ని చట్టాలు చాలా ప్రభావం చూపుతున్నాయి. అవి వారికి భారంగా కూడా మారుతున్నాయి. ఏ చీకూ చింత లేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలకు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్ానరు. అందుకే ప్రస్తుత పరిస్థితులకు సరిపోని, ప్రజలకు అందుబాటులో ఉండని పురాతన చట్టాలను తొలగించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి ప్రస్తుత కాలానికి అవి ఎంత మాత్రం ఉపయోగం ఉండవు. ఊరికే ఉన్నాయా అంటే ఉన్నాయనే భావనలో ఉంటాయి. ఇలాంటివి వ్యవస్థకు ప్రజలకు భారంగా ఉన్నాయిం. అందుకే తీసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము ఇప్పటికే ఇలాంటి 1500 చట్టాలను తొలగించాం’’ అని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.
Rozgar Mela: ఉద్యోగ మేళా ప్రారంభించిన ప్రధాని మోదీ.. 75 వేల మందికి అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ