Rozgar Mela: ఉద్యోగ మేళా ప్రారంభించిన ప్రధాని మోదీ.. 75 వేల మందికి అపాయింట్‭మెంట్ లెటర్ల పంపిణీ

భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాకముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, అయితే ఇప్పుడదని 5వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. ప్రపంచ దేశాలన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సైడ్ ఎఫెక్టులతో బాధపడుతున్నాయని, భారత్‭పై కూడా ఆ ప్రభావం ఉందని, అయితే తాము దాన్ని అధిగమించామని మోదీ అన్నారు.

Rozgar Mela: ఉద్యోగ మేళా ప్రారంభించిన ప్రధాని మోదీ.. 75 వేల మందికి అపాయింట్‭మెంట్ లెటర్ల పంపిణీ

Side effects of biggest crisis in 100 years can't just go away in 100 days: PM Modi

Rozgar Mela: 10 లక్షల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. రోజ్‭గార్ మేళా (ఉద్యోగ మేళా) అనే పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 100 ఏళ్లుగా పీడిస్తున్న అతిపెద్ద సంక్షోభానికి చెందిన దుష్ప్రభావాలు 100 రోజుల్లో పోవని అన్నారు.

ఇక భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాకముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, అయితే ఇప్పుడదని 5వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. ప్రపంచ దేశాలన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సైడ్ ఎఫెక్టులతో బాధపడుతున్నాయని, భారత్‭పై కూడా ఆ ప్రభావం ఉందని, అయితే తాము దాన్ని అధిగమించామని మోదీ అన్నారు. కొన్ని లక్ష్యాలు, కొన్ని రిస్క్‭లు తీసుకుని దేశ ఆర్థిక రంగాన్ని నిలబెట్టగలుగుతన్నామని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఈ 8 ఏళ్లలో చాలా మట్టుకు తగ్గించగలిగామని ప్రధాని మోదీ అన్నారు. ఇక దేశ వ్యాప్తంగా 75,226 మందికి యువతకు నియామక పత్రాలు ఇచ్చారు.

Prashant Kishor: నితీశ్ కుమార్‌కు సవాలు విసిరిన ప్రశాంత్ కిశోర్