ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తాము ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అలాగే, దేశంలో కులగణన చేపడతామని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
కులగణనే తమ ముందున్న అతిపెద్ద అంశమని, తాము దానిని పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన తమకు కేంద్ర స్తంభం వంటిదని రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు రకాల భావజాలాలకు మధ్య జరుగుతున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు.
పేదలు, కొంత మంది కోటీశ్వరులకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని ఆయన అన్నారు. దీంతో మహారాష్ట్ర యువత ఉద్యోగాలు కోల్పోతుందని తెలిపారు.
తమ మహా వికాస్ అఘాడీ మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతుందని ఆయన అన్నారు. ముంబైలోని ధారవి పునరాభివృద్ధి పథకంలో ఒక వ్యక్తికి సాయం చేయడానికి మొత్తం రాజకీయ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించారని రాహుల్ గాంధీ చెప్పారు. మోదీ, గౌతమ్ అదానీ కలిసి ఉన్నంత కాలం వారిద్దరూ సురక్షితంగానే ఉంటారని అన్నారు.
Viral Video: ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీకి బీజేపీ జెండాలు చూపిన కాషాయ పార్టీ కార్యకర్తలు