Mask పెట్టుకోండి, లేకపోతే Google Maps గుర్తుచేస్తుంది

  • Publish Date - July 31, 2020 / 08:01 AM IST

కరోనా వేళ..బయటకు వెళ్లాలని అనుకుంటున్నారా..అయ్యో Mask పెట్టుకోలేదు అని ఫీల్ కాకండి. ఇప్పుడు Google Maps ఆ సంగతి గుర్తు చేస్తుంది. మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తుంది. ‘మాస్క్ ధరించండి..ప్రాణాలు కాపాడు’ (“Wear a Mask. Save Lives.”) అనే కొత్త బ్యానర్ ఏర్పాటు చేసినట్లు గూగుల్ (Google) వెల్లడించింది.



ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్న వారు..మ్యాప్స్ …Exploreలో కనిపిస్తుందని తెలిపింది. ట్యాబ్ కింద ఫేస్ మాస్క్ వేసుకున్న యానిమేషన్ తో రూపొందించిన మహిళ కనిపించనుంది. Learn More బటన్ నొక్కడం వల్ల..Google’s COVID-19 safety tips page దగ్గరకు వెళుతుంది. Centers for Disease Control and Prevention (CDC) నుంచి సమాచారం అందిస్తుంది.

ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా…Mask ధరించాలని CDC సిఫార్సు చేస్తుంది. బహిరంగంగా…ఫేస్ మాస్క్  (Face Mask) ధరించడం అవసరమనే సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి US లోని Android యూజర్లకు మాత్రమే mask reminder banner చూస్తున్నారు. iOS కనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ (Google) తెలిపింది.



కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీంతో గూగుల్ మ్యాప్స్ కొన్ని సూచనలు, సలహాలు ప్రవేశపెట్టింది. ఏదైనా సమాచారం కోసం వెతుకుతున్న సమయంలో..కోవిడ్ హెచ్చరికలు ముందుగా చూపెట్టి..అనంతరం వారికి సమాచారాన్ని ముందుపెట్టింది.

మార్చి మాసంలో లోకల్ బిజినెస్ చేసే వారికి గూగుల్ మ్యాప్స్ పేజీని అప్ డేట్ చేసింది. వారి వ్యాపార లావాదేవీల సమయంలో మార్పులు చేయాల్సిందిగా..తదితర వివరాలను పొందుపరిచింది.

ట్రెండింగ్ వార్తలు