Weather Forecast (Image Credit To Original Source)
Weather Forecast: చలి తీవ్రత తగ్గుతోంది. చలి కాలం నిష్క్రమించే రోజులు వచ్చేశాయి. వచ్చేనెల రెండో వారం నాటికి వేసవికాలం మెల్లగా మొదలవుతుంది. ఈ వేసవి కాలంలో ఎండలతో పాటు అప్పుడప్పుడు వర్షాలను కూడా చూస్తామని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల ఎండావానలను ఈ సీజన్‌లో చూడొచ్చని అంటున్నారు.
Also Read: ఆ రోజున విచారణకు రండి అంటూ ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం.. వచ్చేనెల రెండో వారం నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు, క్లౌడ్బరస్ట్లకూ అవకాశం ఉంటుంది. అసలుసిసలైన వేసవికాలాన్ని ఈసారి మే నెలలోనే చూస్తాం. 2023 ఏడాదిలో కనపడ్డ ఎండల కంటే ఈసారి అధికంగా ఉంటాయి.
మేలోనే కాదు జూన్ తొలి వారంలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. 2023లో బలమైన ఎల్నినో ఏర్పడింది. దీంతో ఆ ఏడాది వేసవి కాలంలో ఎండల తీవ్రత అధికంగా రికార్డయింది. 2025 ప్రారంభం సమయానికి లానినా బలపడి వర్షాలు బాగా కురిశాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి లానినా ఫేజ్ ముగిసిపోయే దశకు వచ్చింది.
దీంతో ఇప్పుడు ఎల్నినోగా మార్పు చెందే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఈ సారి మే నెలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రుతుపవనాల రాక కూడా ఆలస్యం కావచ్చు.