రాయ్ పూర్ : చత్తీస్ ఘడ్ పోలీసులకు వారంతపు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు లేకుండా నిర్విరామంగా విధులు నిర్వరిస్తున్న పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నామని ఆ రాష్ట్ర డీజీపీ డీఎం అవస్ధి తెలిపారు కానిస్టేబుల్ స్ధాయి నుంచి ఇన్స్పెక్టర్ స్ధాయి వరకు అందరు పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు
పోలీసులు ఎక్కువ సేపు నిలబడి డ్యూటీ చేయటం, విధుల్లో ఉండే ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవస్ధి చెప్పారు. అయితే అత్యవసర పరిస్ధితుల్లో వారాంతపు సెలవు ఉండదని అదే నెలలో పెండింగ్ లో ఉన్న సెలవు వాడుకునే వెసులు బాటు ఉంటుందని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పని చేసే వారికి ప్రతి 3 నెలలకోసారి 8 రోజులు సెలవు తీసుకునే అవకాశం కల్పించారు. శాంతిభద్రతల కారణాల వల్ల కొన్నిసార్లు వారాంతపు సెలవులు రద్దు చేసే అవకాశం కూడా ఉందని డీజీపీ చెప్పారు.