Jill Biden, Narendra Modi, Joe Biden (@POTUS)
Narendra Modi – US Visit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆయన సతీమణి జిల్ బైడెన్ (Jill Biden) ఘన స్వాగతం పలికారు. ఈ నెల 20న మోదీ రెండు దేశాల పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా(USA), ఈజిప్టు(Egypt)ల్లో పర్యటిస్తారు.
వైట్‌హౌస్‌లో ఇవాళ బైడెన్, మోదీ అమెరికా జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. వైట్‌హౌస్ వద్దకు ప్రవాస భారతీయులు భారీగా తరలి వచ్చారు. వారికి బైడెన్, మోదీ అభివాదం చేశారు. భారత్, అమెరికా బంధం చాలా ఉన్నతమైనదని బైడెన్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఒకేలా విలువలు ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడి ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇది భారతీయులందరికీ లభించిన గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. తాను 30 ఏళ్ల క్రితం ఓ సామాన్యుడిలా అమెరికా పర్యటనకు వచ్చానని తెలిపారు.
బైడెన్ తో తాను ధ్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటున్నానని మోదీ చెప్పారు. అలాగే, ప్రపంచ సమస్యలపై చర్చిస్తానని తెలిపారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం పనిచేయడానికి భారత్, అమెరికా నిబద్ధతతో ఉన్నాయని చెప్పారు.
Tune in as Jill and I host Prime Minister Modi of India for an Official State Visit to the White House. https://t.co/A5pcHslvsl
— President Biden (@POTUS) June 22, 2023