మోడీతో సమావేశమైన మమత..బెంగాల్ పేరు మార్చాలని వినతి

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇవాళ(సెప్టెంబర్-18,2019)వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలిశారు. వివిధ అంశాలపై మోడీతో మమత చర్చించారు. మోడీతో సమావేశమనంతరం మమత మాట్లాడుతూ….ప్రధానితో సమావేశం బాగా జరిగింది. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలని మోడీని కోరాను. ఈ విష‌యంలో ఏదో ఒకటి చేస్తానని మోడీ మాట ఇచ్చారు.

బీర్‌ బ‌మ్ జిల్లాలో జ‌ర‌గ‌నున్న కోల్ బ్లాక్ డీయోచా ప‌చామీ స‌ద‌స్సుకు మోడీని ఆహ్వానించిన‌ట్లు మమత తెలిపారు. కోల్ బ్లాక్ ప్రాజెక్టును సుమారు 12వేల కోట్లతో చేప‌డుతున్న‌ట్లు ఆమె చెప్పారు.