పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దీదీ వినూత్న నిరసన : సచివాలయానికి ఎలక్ట్రిక్‌ బైక్‌పై వెళ్లిన మమతా బెనర్జీ

Mamata Banerjee’s innovative protest : ఇంధ‌న ధ‌ర‌లు రోజురోజూ విప‌రీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర వంద దాటింది. పెరుగుతున్న పెట్రోల్, డీజీల్‌ ధరలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా సచివాలయానికి ఎలక్ట్రిక్‌ బైక్‌పై వెళ్లారు. సీఎం కార్యాల‌యానికి దీదీ స్కూట‌ర్‌పై వెళ్తున్న దృశ్యాల‌ను అన్ని స్థానిక ఛాన‌ళ్లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశాయి.

మ‌రోవైపు ఇవాళ బెంగాల్‌లో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.91కి అమ్ముతున్నారు. ముంబైలో రూ.97కు అమ్ముతున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే సామాన్యులపై అదనపు భారం పడుతోందని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. ఇంధన ధరల పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆరోపించారు.

బీజేపీ ప్ర‌భుత్వం ఎల్‌పీజీ, డీజిల్ ధ‌ర‌ల‌ను రోజూ పెంచుతోంద‌ని, ఇది ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ఇంధ‌న ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తుంద‌ని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు