చాయ్ వాలీగా దీదీ: ఆయన బాటలోనే

  • Publish Date - August 22, 2019 / 05:16 AM IST

ప్రధాని నరేంద్రమోడీని చాయ్ వాలా అనటం తరచూ వింటుంటాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రధానిని చాయ్ వాలా అంటు సెటైరిక్ గా విమర్శిస్తుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ కూడా చాయ్‌వాలీగా అవతారమెత్తారు. తన చేతులతో స్వయంగా చాయ్ చేసి స్థానికులకు అందించారు. 

బుధవారం (ఆగస్టు21)న దిఘా జిల్లాలోని దుత్తపూర్‌ గ్రామంలో మమత పర్యటించారు. గ్రామస్తుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.పలువురు మహిళలతో ముచ్చటించారు.పసిబిడ్డల్ని ఎత్తుకుని ముద్దు చేశారు. 

ఈ సందర్భంగా ఓ చాయ్‌ దుకాణంలోకి వెళ్లిన మమత.. తన స్వయంగా చాయ్ ను వడకట్టి  స్థానికులకు అందించారు. ఈ దృశ్యాలను మమతా బెనర్జీ తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. జీవితంలో ఇటుంటి సందర్భాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయనీ.. చాయ్‌ను చేసి స్థానికులకు అందించడం ఎంతో అనుభూతిని కలిగించిందని ట్విట్టర్ లో మమతా పేర్కొన్నారు.