Suchetana Bhattacharya
Suchetana Bhattacharya Gender Swap : దేశంలో ఓ మాజీ సీఎం కూతురు లింగ మార్పిడి ద్వారా పురుషుడిగా మారాలనుకుంటున్నారు. మాజీ సీఎం కూతురు చిన్నప్పటి నుంచి తనను తాను పురుషుడిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె లింగ మార్పిడి ద్వారా పురుషుడిగా మారాలనుకున్నారు. దీంతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం న్యాయ నిపుణులు, వైద్య నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు మీడియాకు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కూతురు సుచేతన భట్టాచార్య(41) లింగ మార్పిడికి సిద్ధమయ్యారు. ఇటీవల ఎల్ జీబీటీక్యూ వర్క్ షాప్ కు ఆమె హాజరయ్యారు. దీంతో పుట్టుక నుంచే తాను పురుషుడినన్న ఆమె నమ్మకం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో లింగ మార్పిడి సర్జరీ ద్వారా శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సుచేతన నుంచి సుచేతన్ గా పేరు మార్చుకునేందుకు సంబంధిత న్యాయ, వైద్య సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Tiger : నంద్యాల జిల్లాలో మహిళపై పెద్దపులి దాడికి యత్నం
కాగా, జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగానే ఈ నిర్ణయాన్ని కూడా తాను సొంతంగా తీసుకున్నట్లు సుచేతన తెలిపింది. ఎల్ జిబిటిక్యూ ఉద్యమంలో భాగంగానే పురుషుడిగా మారుతున్నట్లు తెలిపారు. అలాగే ట్రాన్స్ మ్యాన్ గా ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను లింగ మార్పిడి ద్వారా ఆపాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
తాను మానసికంగా పురుషుడినని నమ్ముతున్నానని, ఇకపై శారీరకంగా కూడా అలాగే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. మరోవైపు తల్లిదండ్రులు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద సమస్య కాదని సుచేతన చెప్పారు. చిన్నప్పటి నుంచి తన గురించి తెలిసిన తండ్రి, తన నిర్ణయానికి మద్దతిస్తారని భావిస్తున్నానని తెలిపారు. అయితే ఈ వివాదంలోకి తన తల్లిదండ్రులను లాగవద్దని మీడియాకు సూచించారు. ఈ విషయంపై రాద్ధాంతం చేయవద్దని కోరారు.