Student Dies Falling : షాకింగ్ వీడియో.. ఫ్రెండ్స్ కళ్ల ముందే చనిపోయాడు, రెప్పపాటులో ఊహించని ఘోరం
ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఎంతో భయానకంగా ఉంటాయి. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. కళ్ల ముందే మృత్యువులోకి జారుకుంటారు. అలాంటి ఓ షాకింగ్ ఘటన ఒకటి రాజస్తాన్ లో చోటు చేసుకుంది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడు. చూస్తుండగానే అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
- Naveen
- Updated on- February 3, 2023 / 11:53 PM IST
Student Dies Falling : ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఎంతో భయానకంగా ఉంటాయి. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. కళ్ల ముందే మృత్యువులోకి జారుకుంటారు. అలాంటి ఓ షాకింగ్ ఘటన ఒకటి రాజస్తాన్ లో చోటు చేసుకుంది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడు. చూస్తుండగానే అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ప్రమాదవ శాత్తు 6వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. దీంతో అతడి ఫ్రెండ్స్ షాక్ కి గురయ్యారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇషాంషు భట్టాచార్య(20) అనే విద్యార్థి నీట్ కోచింగ్ కోసం కోటాలోని కోచింగ్ ఇన్ స్టిట్యూట్ కు వచ్చాడు. హాస్టల్ లో ఉంటున్నాడు. కాగా, అదే హాస్టల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో అతడు తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు.
తమ కళ్ల ముందే భట్టాచార్య కిందకి పడి చనిపోవడం ఫ్రెండ్స్ ను షాక్ కి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మృతుడు భట్టాచార్య ఆగస్టులో రాజస్తాన్ కు వచ్చాడు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ కు ప్రిపేర్ అవుతున్నాడు. భట్టాచార్య ఓ హాస్టల్ లో ఉంటున్నాడు. కాగా, తన ముగ్గురు స్నేహితులతో కలిసి అతడు.. బిల్డింగ్ 6వ అంతస్తు బాల్కనీలో ముచ్చట్లు పెట్టాడు. నలుగురూ చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నారు. నవ్వుకున్నారు. హ్యాపీగా గడిపారు. అర్థరాత్రి దాటాక రూమ్ కి వెళ్లేందుకు అంతా లేచారు.
భట్టాచార్య తన కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో భట్టాచార్య బ్యాలెన్స్ కోసం తన వెనుకున్న రెయిలింగ్ ని అనుకున్నాడు. అయితే అతడు బ్యాలెన్స్ కోల్పోయాడు. తన వెనుకే ఉన్న రెయిలింగ్ పై పడ్డాడు. ఆ రైలింగ్ ఊడిపోయింది. అంతే, 6వ అంతస్తు నుంచి అతడు కింద పడి చనిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోవడం చూసి ఫ్రెండ్స్ షాక్ లో ఉండిపోయారు. కాగా, ఆ బాల్కనీ రెయిలింగ్ వీక్ గా ఉంది. ఈ విషయాన్ని వారు గుర్తించలేదు. భట్టాచార్య బరువు దాని మీద పడటంతో అది ఊడిపోయింది. ఆ తర్వాత ఎవరూ ఊహించని ఘోరం జరిగిపోయింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
