Omicron Scare : మమత సంచలన నిర్ణయం…అన్ని విమానాలు రద్దు

కొద్ది నెలల విరామం తర్వాత మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా, ప్రస్తుతం ప్రపంచానికి కొత్త టెన్షన్ గా మారిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" వ్యాప్తిని నిలువరించేందుకు బెంగాల్

Flight

Omicron Scare :  కొద్ది నెలల విరామం తర్వాత మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా, ప్రస్తుతం ప్రపంచానికి కొత్త టెన్షన్ గా మారిన కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” వ్యాప్తిని నిలువరించేందుకు బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 3 నుంచి యూకే నుంచి కోల్ కతాకు నేరుగా వచ్చే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.

అదేవిధంగా ఎట్ రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచి వెస్ట్ బెంగాల్ కి చేరుకున్న వెంటనే కోవిడ్ టెస్ట్ ను తమ సొంత ఖర్చులతో చేయించుకోవడం తప్పనిసరి. అదేవిధంగా ఫైట్ ఎక్కేముందు కోవిడ్ టెస్ట్ కోసం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని మమత సర్కార్ సృష్టం చేసింది.

కాగా,ఇవాళ ఉదయం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ..యూకే నుంచి వచ్చే ఫ్లైట్ లలో వచ్చినవాళ్లలోనే ఎక్కువగా ఒమిక్రాన్ ను గుర్తించినట్లు తెలిపారు. అంతర్జాతీయ విమానాల ద్వారానే ఒమిక్రాన్ క్యారియర్స్ వస్తున్నారనేది నిజమని మమత తెలిపారు. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే విమానాల విషయంలో కేంద్రం ఆంక్షలు విధించడంపై నిర్ణయం తీసుకోవాలని మమత అన్నారు.

మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపంలో 2022 జనవరి 8 నుంచి 16 వరకు గంగా సాగర్ మేళా జరగనున్న నేపథ్యంలో.. గంగా సాగర్ మేళాలో ఎటువంటి కోవిడ్ సంబంధిత ఆంక్షలు ఉండబోవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సృష్టం చేశారు. కుంభమేళా జరిగినపుడు ఇటువంటి ఆంక్షలేమైనా ఉన్నాయా? అని మమత ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఇతర సుదూర ప్రాంతాల నుంచి గంగా సాగర్ మేళాలో పాల్గొనేందుకు వచ్చేవారిని ఎలా ఆపగలమని ఆమె అన్నారు.

ALSO READ OnePlus 10 Pro : లాంచింగ్ ముందే ఫీచర్లు లీక్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తోంది..!