Digital Rupee in India : డిజిటల్ రూపీతో సాధారణ ప్రజలకు లాభమేంటి? డిజిటల్ కరెన్సీ ఎంత వరకు సేఫ్?

ఇండియా డిజిటల్ జర్నీలో.. డిజిటల్ రూపీ చాలా మార్పులు తీసుకురాబోతోంది. ఈజీ బిజినెస్, జనాల్లో విశ్వాసం, పేమెంట్ సిస్టమ్‌పై నమ్మకం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్యూచర్ కరెన్సీగా అభివర్ణిస్తున్న ఈ డిజిటల్ రూపీతో.. సాధారణ ప్రజలకు ఉన్న లాభమేంటి? అసలు.. డిజిటల్ కరెన్సీ ఎంత వరకు సేఫ్? డిజిటల్ రూపీ కూడా క్రిప్టో కరెన్సీ లాంటిదేనా?

What is the benefit to common people with digital rupee_

Digital Rupee in India :   ఇండియా డిజిటల్ జర్నీలో.. డిజిటల్ రూపీ చాలా మార్పులు తీసుకురాబోతోంది. ఈజీ బిజినెస్, జనాల్లో విశ్వాసం, పేమెంట్ సిస్టమ్‌పై నమ్మకం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్యూచర్ కరెన్సీగా అభివర్ణిస్తున్న ఈ డిజిటల్ రూపీతో.. సాధారణ ప్రజలకు ఉన్న లాభమేంటి? అసలు.. డిజిటల్ కరెన్సీ ఎంత వరకు సేఫ్? డిజిటల్ రూపీ కూడా క్రిప్టో కరెన్సీ లాంటిదేనా?

ఇండియన్ ఎకానమీలో.. డిజిటల్ రూపీని సరికొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. అయితే.. ఇది బిట్ కాయిన్, డాగీ కాయిన్‌లా.. క్రిప్టో కరెన్సీ కాదు. క్రిప్టో కరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపీని మైనింగ్ చేసేందుకు అవకాశం లేదు. క్రిప్టో కరెన్సీలో వాడే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీని డిజిటల్ రూపీలోనూ వాడొచ్చు. కానీ.. ఆ టెక్నాలజీని వాడతామని ఆర్బీఐ అయితే కచ్చితంగా చెప్పలేదు. బిట్‌కాయిన్, ఇథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలపై ఎవరి నియంత్రణ ఉండదు. కానీ డిజిటల్ రూపీ మీద ఆర్‌బీఐ నియంత్రణ ఉంటుంది. అయితే.. క్రిప్టో కరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపీ కూడా వర్చువల్ రూపంలో వాడుకలో ఉంటుంది. సీబీడీసీ ప్రతి యూనిట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రతి యూనిట్‌ను ట్రేస్ చేయొచ్చు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. డిజిటల్ రూపీ ప్రోగ్రామబుల్. కాలపరిమితి, ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అన్ని లావాదేవీలు, బ్యాలెన్సులకు సంబంధించిన సమాచారం బ్లాక్-చైన్ రూపంలో రికార్డ్ అయి ఉంటుంది. డిజిటల్ రూపీకి.. భౌగోళిక పరిధి అంటూ ఏమీ ఉండదు. అంతర్జాతీయంగా ఆమోదం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా డిజిటల్ రూపీతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది.

ఇక.. డిజిటల్ కరెన్సీ చట్టబద్ధంగా చెల్లుబాటవుతుంది. డిజిటల్ రూపీ సాయంతో పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చంట్‌కు లావాదేవీలు జరపొచ్చు. అయితే.. ఇప్పుడదే తరహాలో యూపీఐ పేమెంట్స్ కూడా జరుగుతున్నాయ్. మరి.. యూపీఐ చెల్లింపులకు, డిజిటల్ చెల్లింపులకు పెద్దగా తేడా ఏముందనే డౌట్ రావొచ్చు. ఈ రెండు విధానాల్లో ప్రాసెస్ సేమ్ అయినా.. పాయింట్ మాత్రం వేరే ఉంది. యూపీఐ చెల్లింపులకు, డిజిటల్ కరెన్సీకి చాలా తేడా ఉంది. మనం ఫోన్-పే, గూగుల్-పే లాంటి యాప్స్‌ని ఉపయోగించి.. డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాం. అయితే ఈ వాలెట్లలో ఉండే డబ్బును డిజిటల్ కరెన్సీగా పిలవలేం. ఎందుకంటే.. యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతున్న డబ్బు.. బ్యాంకుల్లోని మన అకౌంట్లలో ఫిజికల్ కరెన్సీ రూపంలోనే ఉంటుంది. ఆ డబ్బునే.. మన అకౌంట్ నుంచి వేరే ఖాతాకు బదిలీ చేస్తున్నాం. అదే.. డిజిటల్ రూపీకి వచ్చేసరికి.. ఫిజికల్ కరెన్సీ ప్రసక్తే ఉండదు. మీ పేపర్ కరెన్సీని ఉపయోగించి.. మీరు బ్యాంకుల నుంచి డిజిటల్ కరెన్సీని కొనుగోలు చేయాలి. అది ఎప్పటికీ మీ ఖాతాలో డిజిటల్ రూపంలోనే ఉంటుంది. డిజిటల్ కరెన్సీ పూర్తిగా అధికారికంగా చెలామణీ అవుతుంది.

Digital Rupee in India : డిజిటల్ రూపీ అంటే ఏంటి? డిజిటల్ రూపాయితో ఉన్న అవసరమేంటి?

డిజిటల్ రూపీతో చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించిన మొత్తం సమాచారం ఆర్బీఐ దగ్గర నమోదవుతూ ఉంటుంది. యూపీఐ పేమెంట్స్‌ను బ్యాంకులు నిర్వహిస్తాయి. కానీ.. డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంకే నేరుగా మానిటర్ చేస్తుంది. డిజిటల్ కరెన్సీ పంపిణీ మినహా వాటి లావాదేవీల్లో బ్యాంకులకు ప్రమేయం ఉండదు. యూపీఐ చెల్లింపుల మాదిరిగా.. డిజిటల్ రూపీ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అవసరం ఉండదు. అలాగే.. ఇతర దేశాల్లో పని చేసే భారతీయులు డిజిటల్ రూపీ సాయంతో.. మన దేశంలోని తమ వాళ్లకు తక్కువ ఖర్చుతోనే డబ్బులు పంపొచ్చు.

ఇక.. ప్రపంచంలో వందకు పైగా దేశాలు డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయని.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెబుతోంది. ప్రస్తుతం నైజీరియా, జమైకాతో సహా 10 దేశాలు డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చాయి. వచ్చే ఏడాది చైనా డిజిటల్ కరెన్సీ తీసుకురానుంది. జీ20 గ్రూపులోని 19 దేశాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ హామీ ఉండే డిజిటల్ కరెన్సీలో.. రిస్క్ ఉండదని యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. 27 సభ్య దేశాల్లో యురోపియన్ యూనియన్ త్వరలోనే డిజిటల్ కరెన్సీ తీసుకురానుంది. ఇక.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోంది. తాము తీసుకురాబోయే డిజిటల్ కరెన్సీ.. అత్యంత సురక్షితంగా ఉంటుందని చెబుతోంది.

RBI CBDC Digital Rupee : దేశంలో తొలిసారి డిజిటల్‌ రూపాయి.. నేటి నుంచి చలామణిలోకి..

డిజిటల్ రూపీతో.. పారదర్శకత మరింత పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చెల్లింపు, నిర్వహణలో మరింత సమర్థత, విశ్వాసం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డిజిటల్ రూపీ ద్వారా చేసే పేమెంట్లు రియల్-టైమ్. ప్రభుత్వానికి అన్ని లావాదేవీల యాక్సెస్ ఉంటుంది. అవసరమైతే వీటిని పరిశీలించొచ్చు. డిజిటల్ రూపీ విషయంలో ప్రింటింగ్, పంపిణీ, వేర్వేరు నోట్ల నిర్వహణ లాంటి ఖర్చుల భారం ఉండదు. నగదు రవాణా ఖర్చులు అసలే ఉండవు. అన్ని ఆథరైజ్డ్ నెట్‌వర్కుల పరిధిలో జరిగే లావాదేవీలను ప్రభుత్వం పొందొచ్చు. మోసాలను అరికట్టేందుకు కూడా డిజిటల్ రూపీ దోహదపడుతుంది. డిజిటల్ రూపీతో.. జేబులో నగదు ఉంచుకోవాల్సిన పనిలేదు. బ్యాంకు అకౌంట్లలోనే డబ్బు సేవ్ చేయాలన్న ప్రెజర్ ఉండదు. పైగా.. క్యాష్ లెస్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇటువంటి లావాదేవీలతో సామాన్య ప్రజలకు ఉపయోగమేనంటున్నారు ఆర్థిక నిపుణులు. డిజిటల్ రూపీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. నగదుపై ఆధారపడటం తగ్గుతుందని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.