బీచ్ లో చెత్త ఏరేటప్పుడు చేతిలో ఉన్న వస్తువుపై మోడీ క్లారిటీ

  • Publish Date - October 13, 2019 / 11:18 AM IST

మహాబలిపురం బీచ్ లో శనివారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్ లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ కోసం శుక్రవారం మోడీ తమిళనాడులోని మహాబలిపురానికి వెళ్లిన విషయం తెలిసిందే.

అయితే చెత్తను తొలగించే సమయంలో మోడీ చేతిలో ఉన్న ఓ వస్తువుపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అది టార్చ్‌లైట్‌ అని కొందరు, స్లిమ్ గా ఉన్న డంబెల్‌ అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశాడురు. దీని గురించి ప్రధాని మోడీకి ప్రశ్నలు వెల్లువలా వచ్చి పడుతుండడంతో స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. 

 మామల్లాపురంలోని బీచ్ లో నేను చెత్త తీస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న వస్తువు గురించి నిన్నటి నుంచి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌. నేను దాన్ని తరచుగా వాడుతుంటాను. ఎందుకంటే నాకది ఎంతో మేలు చేసింది అంటూ మోడీ ట్వీట్ లో తెలిపారు. ఆక్యుప్రెజర్‌ రోలర్‌ అనేది చేతిలో ఇమిడిపోయే ఒక రకమైన వ్యాయామ పరికరం. ఉదయాన్నే దీన్ని ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.