కొడుకుని వేధించిన స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓ సెల్ఫీ కోసం కన్నకొడుకుని వేధించింది.స్వయంగా ఈ విషయాన్నే ఆమె ఒప్పుకుంది.సెల్ఫీ కోసం కొడుకుని వేధింపులకు గురి చేయడం ఏమిటి అనుకుంటున్నారా? కొడుకు జోర్ ఇరానీని వేధిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటోకి ఇప్పుడు ఫుల్ రెస్ఫాన్స్ వస్తుంది.

సోషల్ మీడియాలో స్మృతి ఇరానీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.ఇన్ స్టాగ్రామ్ లో ఇరానీ దంపతులు తరచుగా తమ ఫొటోలతో పాటు తమ పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో సోమవారం(ఏప్రిల్-2,2019) తన కొడుకుతో కలిసి దిగిన ఓ సెల్ఫీని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.మీ కొడుకు ఫ్రెండ్ కోసం క్లీన్ గా రెడీ అయినప్పుడు బదులుగా ఓ సెల్ఫీ కోసం అతడిని వేధించండి అంటూ మఖఅత్యాచార్,ఖహానిఘర్ ఘర్కీ యాష్ ట్యాగ్ తో ఆమె ఆ ఫొటోను షేర్ చేశారు.దీంతో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన నెటిజన్లు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.మరికొందరు కొడుకుపై కన్నతల్లి ప్రేమ అంటే ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.గతంలో కూడా కొడుకుతో ఉన్న ఫొటోలను సృతి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ ఫొటోలకు అప్పుడు కూడా నెటిజన్ల నుంచి ఫుల్ రెస్ఫాన్స్ వచ్చింది.