తోకముడిచారు : తెల్ల జెండాలు చూపి శవాలను మోసుకెళ్లిన పాక్ ఆర్మీ

పీవోకేపై కూడా ఇప్పుడు పాక్ కు ఆశలు సన్నగిల్లుతున్నాయి. చొరబాట్లను ప్రోత్సహించడానికి పాక్ సైన్యం చేసిన కుట్రను భారత బలగాలు తిప్పికొట్టాయి. భారత్‌కు దీటుగా బదులిస్తాం, అణు యుద్ధం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్న పాక్ ఆర్మీ యుద్ధం కాదు కదా, చిన్నపాటి ఘర్షణల్లోనే కుప్పకూలుతోంది. తర్వాత తెల్ల జెండాలు చూపి, మమ్మల్ని చంపొద్దు బాబోయ్ అని తోక ముడుస్తోంది. 

ఈ నెల 10,11న జమ్మూ కశ్మీర్ సరిహద్దులోని పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని హాజీపూర్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికులు భారత సైనికులపై కాల్పులు జరిపారు. భారత జవాన్లు వాటిని దీటుగా తిప్పికొట్టారు. భారత ఆర్మీ కాల్పుల్లో ఒక పాక్ సైనికులు హతమయ్యారు. కాగా తుపాకులతో కాల్పులు జరుపుతూ ఆ మృత దేహాన్ని తీసుకెళ్లడానికి పాకిస్తాన్‌ సైనికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో మరొక పాక్‌ సైనికుడు కూడా మృతి చెందాడు. పులుల్లా విరుచుకుపడుతున్న భారత సైనికులను చూసి దాయాది సైనికులు బెంబేలెత్తిపోయారు. చనిపోయిన సహచరుల శవాలను తీసుకెళ్లడానికి తెల్లజెండాలు ఎగరేశారు. యుద్ధనీతి ప్రకారం తెల్లజెండాలు చూపాక కాల్పులు జరపకూడదు కనుక మన సైనికులు సంయమనం పాటించారు. తర్వాత ఈ నెల 13న పాక్ సైనికులు తెల్లజెండాలు చూపుతూ తమ సహచరుల శవాలను మోసుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి పాక్ భారత్ పై విషం కక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలు ఇది అంతర్భాగ విషయమని చెబుతుంటే పాక్ మాత్రం ఐక్యరాజ్యసమితికి వెళ్తాం,అంతర్జాతీయ కోర్టుకి వెళ్తాం అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ తమ దశ ప్రజలను మభ్యపెడుతోంది. ఇప్పటికే పాక్ సర్కార్ తీరుపై ఆ దేశ ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ లోని కశ్మీర్ గురించి ఆలోచించడం మానేసి తమ ఆధీనంలో ఉన్న ముజఫరాబాద్ ను కాపాడుకోవడానికి ప్రయత్నించాలన్నారు. పాక్ కు చెందిన అనేకమంది మానవహక్కుల ఉద్యమకారులు కూడా కశ్మీర్ విషయంలో ఇమ్రాన్ ఖాన్ వైఖరిని తప్పుబడుతున్న విషయం తెలిసిందే.