Air Marshal Jeetendra Mishra : అయోధ్య రామ మందిర ఫస్ట్ CEO ఇతడే.. జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే!

Air Marshal Jeetendra Mishra : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. భారత వైమానిక దళంలో 38 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన ఎన్నో కీలక పదవులను కూడా చేపట్టారు.

Air Marshal Jeetendra Mishra

  • అయోధ్య రామ మందిర తొలి సీఈఓగా జితేంద్ర మిశ్రా నియమాకం
  • మాజీ ఎయిర్ మార్షల్ మిశ్రా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
  • 38 ఏళ్ల వైమానిక దళ అనుభవం.. ఇప్పుడు రామ మందిర సీఈఓగా

Air Marshal Jeetendra Mishra : అయోధ్యలోని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావనిలో మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జితేంద్రతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి రాజేష్ పాండే, మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ చంద్ర కూడా ఈ పదవి కోసం పోటీపడగా ట్రస్ట్ మాత్రం జితేంద్రను సీఈఎంగా ఫైనల్ చేసింది.

ఈ సమావేశానికి ట్రస్ట్ సీనియర్ కార్యవర్గ సభ్యులు, ఆహ్వానిత సభ్యులు హాజరయ్యారు. అంతేకాదు.. అయోధ్యకు చెందిన సీనియర్ న్యాయవాది మదన్ మోహన్ పాండే; ఢిల్లీకి చెందిన మహేష్ భగచంద్కా, అయోధ్యకు చెందిన నిర్మలా యాదవ్‌లతో సహా ముగ్గురు కొత్త సభ్యుల నియామకాన్ని కూడా ట్రస్ట్ ప్రకటించింది.

4 దశాబ్దాల అనుభవం :
జితేంద్ర మిశ్రా కేవలం సాధారణ పరిపాలనా అధికారి కాదు. ఆయన భారత వైమానిక దళంలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ అధికారి. 1986 డిసెంబర్ 6న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పైలట్‌గా నియమితులయ్యారు. ఫైటర్ కంబాట్ లీడర్, టెస్ట్ పైలట్‌గా కూడా సేవలందించారు. అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీకి కూడా ఆయన పూర్వ విద్యార్థి.

Read Also : Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. లాటరీలో ఎంపికైన వారికి అసలు పరీక్ష ఇప్పుడే!

ఎయిర్ పోర్స్ కెరీర్‌లో మిగ్-21 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ కూడా. టెస్ట్ పైలట్స్ స్కూల్‌లో సీనియర్ టెస్ట్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, హెచ్ఎఎల్ చీఫ్ టెస్ట్ పైలట్, ఫ్లయిట్ అప్‌గ్రేడ్ ప్రాజెక్టుల డైరెక్టర్, Su-30 MKI ఆపరేటింగ్ బేస్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ వంటి కీలక బాధ్యతలు కూడా చేపట్టారు. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ అసెస్‌మెంట్ గ్రూప్ డైరెక్టర్‌గా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కూడా జితేంద్ర పనిచేశారు.

కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలు :

వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా కూడా ఆయన సేవలందించారు. Su-30 ఎంకేఐ బ్లాక్ IV, బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ వంటి కీలక ప్రాజెక్టుల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. ఫ్రాన్స్‌లో జరిగిన గరుడా IV మల్టీనేషనల్ వైమానిక విన్యాసంలోనూ భారత బృందానికి నాయకత్వం వహించారు. ఆపరేషనల్ ప్లానింగ్, అంతర్-సేవల సమన్వయం, జాతీయ-అంతర్జాతీయ విన్యాసాల నిర్వహణలో అపార అనుభవం ఉంది.

ముగ్గురు కొత్త ధర్మకర్తల నియామకం :
ఆయన సేవలకు అతి విశిష్ట సేవా పతకం (AVSM), సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకం (SYSM), విశిష్ట సేవా పతకం (VSM) లభించాయి. ఏప్రిల్ 30, 2026న రిటైర్మెంట్ అయ్యాక అనంతరం ఇప్పుడు రామ మందిర ట్రస్ట్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ముగ్గురు కొత్త ధర్మకర్తలను కూడా నియమించింది. ఢిల్లీకి చెందిన మహేష్ భగచంద్కా, అయోధ్యకు చెందిన సీనియర్ న్యాయవాది మదన్ మోహన్ పాండే, షికోహాబాద్‌కు చెందిన నిర్మలా యాదవ్ కొత్త సభ్యులుగా ఎంపికయ్యారు.