Supreme Court: పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత.. బిల్లులపై వివరాలు ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
పెట్రోల్ బంకు ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో ప్రదర్శించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సుప్రీం కోర్టు(Supreme Court) నిరాకరించింది.
Supreme court refuses pil seeking mandatory display of ethanol percentage
- ఇథనాల్ శాతం వెల్లడించాలంటూ పిటిషన్
- సుప్రీంకోర్టు వ్యాజ్యం స్వీకరించలేదు
- హైకోర్టును ఆశ్రయించాలని సూచన
Supreme Court: పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో తప్పనిసరిగా ప్రదర్శించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) స్వీకరించేందుకు సుప్రీం కోర్టు(Supreme Court) నిరాకరించింది. అయితే, వినియోగదారుల పారదర్శకతకు సంబంధించిన ఈ అంశంపై పిటిషనర్ సంబంధిత హైకోర్టును కానీ, సమర్థిక అధికారాన్ని కానీ ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. అడ్వొకేట్ నరేంద్ర కుమార్ గోస్వామి దాఖలు చేసిన ఈ పిటిషన్, వినియోగదారులకు ఇంధనంపై ఉన్న హక్కులను ప్రధానంగా ప్రస్తావించింది.
Delhi Gangrape: మరో నిర్భయ తరహా ఘటన.. కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం.. ఢిల్లీలో ఘోరం
పిటిషనర్ డిమాండ్లు – వినియోగదారుల హక్కులు:
పెట్రోల్ బంకుల్లోని డిస్పెన్సింగ్ నాజిల్స్పై, కస్టమర్లకు ఇచ్చే రసీదులపై ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ముద్రించాలని పిటిషనర్ కోరారు. తాము కొనుగోలు చేస్తున్న ఇంధనం నాణ్యత, అందులోని మిశ్రమాల వివరాలు తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని వాదించారు. ఈ పిటిషన్ ప్రభుత్వ ఈ20 (E20) విధానానికి వ్యతిరేకం కాదని, కేవలం పారదర్శకత పెంచడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ఈ20 పెట్రోల్ విధానం – వాహనదారుల ఆందోళన:
ప్రస్తుతం అమలులో ఉన్న ఈ20 పెట్రోల్లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటాయి. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్య ఉద్గారాలను నియంత్రించడం, బయోఫ్యూయల్స్ వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం లక్ష్యం. అయితే, పాత వాహన ఇంజిన్లు అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలంగా లేకపోవడంతో వాహనదారుల్లో కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
