Parliament Winter Session: ఇప్పుడు చెప్పండి, పప్పు ఎవరు?.. లోక్‭సభలో మోదీ ప్రభుత్వంపై మహువా ఫైర్

మహువా చేసిన ఈ పప్పు వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆ పార్టీ ఎంపీ జగదాంబికా పాల్‌ స్పందిస్తూ మహువా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌‭ను కోరారు. మోదీ హయాంలోనే భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్న ఆయన, 2024లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Parliament Winter Session: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని అధికార భారతీయ జనతా పార్టీ నేతలు పప్పు అంటూ విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఇదే పదాన్ని వినియోగిస్తూ మోదీ ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు నిధుల వ్యయానికి సంబంధించిన చర్చలో భాగంగా ఆమె మాట్లాడుతూ పారిశ్రామికోత్పత్తి, ఇతర గణాంకాలను ఉదాహరణగా చూపుతూ ‘ఇప్పుడు చెప్పండి, పప్పు ఎవరు?’ అంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.

దేశంలో పారిశ్రామికోత్పత్తి 26 నెలల కనిష్ఠానికి చేరిందని, ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే తయారీ రంగం ఏకంగా 5.6 శాతం క్షీణించిందని మహువా మోయిత్రా తెలిపారు. జాతీయ గణాంక కార్యాలయం వెలువరించిన పారిశ్రామికోత్పత్తి డేటాను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయ పారిశ్రామికోత్పత్తి గతేడాది అక్టోబర్‌లో 3.3 శాతం వృద్ధి నమోదు చేస్తే ఈ ఏడాది 5.6. శాతం క్షీణించిందని, దేశ విదేశీ నిల్వలు 72 బిలియన్‌ డాలర్లు పడిపోయాయాయని, ఇప్పుడు పప్పు అని ఎవర్ని అనాలంటూ ఆమె ప్రశ్నించారు.

Kalaburagi Railway Station: రైల్వే స్టేషన్‭కు ఆకుపచ్చ రంగు.. మసీదులా ఉందంటూ హిందూ సంఘాల నిరసన

ప్రభుత్వ వైఫల్యాలే కాకుండా ఎన్నికల ఓటమిని సైతం ప్రస్తావించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజాపా ఓటమి ఓడిందని, మరి ఇప్పుడు ఎవరిని పప్పు అనాలంటూ ప్రశ్నించారు. 2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దు చేశారని, ఇప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదని అన్న మహువా.. దేశంలో నగదే రారాజుగా వెలుగొందుతోందని, నకిలీ కరెన్సీ అరికట్టడం అనేది ఇప్పటికీ కలగానే ఉందని అన్నారు. మరి దీనికి పప్పు అని ఎవరిని అడగాలంటూ మహువా మోయిత్రా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే మహువా చేసిన ఈ పప్పు వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆ పార్టీ ఎంపీ జగదాంబికా పాల్‌ స్పందిస్తూ మహువా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌‭ను కోరారు. మోదీ హయాంలోనే భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్న ఆయన, 2024లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Bihar: సీఎం కుర్చీని తేజస్వీ యాదవ్‭కు వదిలేసిన నితీశ్ కుమార్.. అలా అని తాను పీఎం రేసులో కూడా లేరట

ట్రెండింగ్ వార్తలు