karnataka Election .. transgender Ramakka
karnataka Election 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఆకట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ట్రాన్స్ జెండర్ (third gender). ఆమె వయస్సు 59 ఏళ్లు. ట్రాన్స్ జెండర్ల పట్ల సమాజంలో ఎలాంటి వివక్ష ఉంటుందో వారి జీవితాలు ఎలా ఉంటాయో ఆమె అనుభం నేర్పింది. దీంతో ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో మార్పు తీసుకురాలనే ఉద్ధేశంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతోంది. బళ్లారి జిల్లాలోని కంప్లి అసెంబ్లీ నియోజవకవర్గం నుంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన 59 ఏళ్ల రామక్క నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.దేశ్ ప్రేమ్ పార్టీ నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక ట్రాన్స్ జెండర్ అభ్యర్థిగా ఉన్నారు రామక్క.
బళ్లారి జిల్లాలోని కుగోడ్ తాలూకాలోని బాదనహట్టి గ్రామానికి చెందినవారు రామక్క. సమాజంలో లింగ వివక్ష తీవ్రంగా ఉందని ముఖ్యంగా ట్రాన్స్ జెండర్లు అంటే చులకన భావం ఉందని తెలిపారు. ట్రాన్స్ జెండర్లు చాలామంది యాచకులుగా జీవిస్తుంటారని కానీ అలా చేయటం మాకు ఇష్టం లేదు ఏదైనా కష్టపడి పనిచేసుకోవాలని అనుకుంటాం కానీ మాలాంటివారికి ఎవ్వరు పని ఇవ్వరని వాపోయారు. ఉపాధి లేకే భిక్షాటన చేస్తుంటామని సమాజంలో మాలాంటివారిపై వివక్ష పోవాలని కోరుకుంటున్నాను. నా తోటి ట్రాన్స్ జెండర్లు గౌరవంగా బతకటానికి తాను ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకున్నానని ట్రాన్స్ జెండర్ల సమస్యలు పరిష్కరించటానికి ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు.
ట్రాన్స్ జెండర్లకు ఉండటానికి ఇల్లు ఉండదు..అద్దెకు ఇవ్వటానికి కూడా ఎవ్వరు ఇష్టపడరని అలాగే బతకటానికి భిక్షాటన ఉండటానికి ఏదోకచోట రోజులు గడిపేస్తుంటామని వాపోయారు. ట్రాన్స్ జెండర్ల కోసం సమాజంలో మార్పు రావాలని దాని కోసం కృషి చేయానికే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు రామక్క. ఎవ్వరు మాలాంటివారికి పని ఇవ్వరు దీంతో వేరే దారిలేక భిక్షాటన చేస్తుంటామని అలా రోజుకు రూ.500ల నుంచి రూ.2వేలు సంపాదిస్తామని తెలిపారు. నాకు అమ్మ ఉంది. ఆమె వయస్సు 107 ఏళ్లు.మా ఊరిలోనే ఉంటుంది. అమ్మను నేనే చూసుకుంటున్నా అలా నాకు యాచించటం తప్ప మరో మార్గం లేదని వాపోయారు రామక్క. నా తోటి ట్రాన్స్ జెండర్ల జీవితాలు సరిదిద్దాలని ఆశపడుతున్నా..ఆ ఆశతోనే వారి సమస్యలు పరిష్కరించాలనే తపనతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు రామక్క.
కానీ ఎన్నికల్లో అంగ బలం, అర్థ బలం ఉన్నవారితో పోటీ పడాలి. వారే ఎన్నికల్లో గెలుస్తారని తెలుసు. కానీ నా అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరిక్షించుకోవాలనే అదృష్టం బాగుంటే గెలిస్తే ట్రాన్స్ జెండర్ల సమస్యలన పరిష్కరిస్తానని తెలిపారు. మునీరాబాద్ హులిగెమ్మ దేవత దయ ఉంటే గెలుస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు రామక్క. నా తోటి ట్రాన్స్ జెండర్లు అంతా నాకు మద్దతు ఇస్తున్నారని..వారితో కలిసి ఎన్నికల ప్రచారం వెళ్తున్నానని తెలిపారు.
రామక్క రామస్వామినుంచి పుట్టిన రామక్కగా మారింది. 14 ఏళ్ల వయస్సులో అమ్మాయిగా మారింది. హులిగెమ్మకు సేవ చేయటం మొదలుపెట్టింది. రామక్క భిక్షాటనతో పాటు జానపద నృత్యమైన జోగతి నృత్యకారణికి కూడా. ఎప్పుడు స్కూలుకు కూడా వెళ్లని రామక్క కర్ణాటకలోని మునీరాబాద్ లో ఉన్న స్థానిక దేవత హులిగేమ్మను సేవకు అంకితమైంది. రామక్కకు కురుగోడుతోపాటు చుట్టుపక్కల పదుల సంఖ్యలో గ్రామాల్లో ఆయనకు మంచి పేరుంది. ఆ పేరుతోనే తాను విజయం సాధిస్తానని ఆశిస్తున్నారు. తన తోటి ట్రాన్స్ జెండర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు రామక్క.