శారదా చిట్ ఫండ్ స్కామ్ లో కోల్ కతా సీపీని రాజీవ్ కుమార్ ని విచారించేందుకు ఎటువంటి వారెంట్ లేకుండా కోల్ కతాలోని ఆయన నివాసానికి ఆదివారం(ఫిబ్రవరి-4,2019) సీబీఐ అధికారుల బృందం రావడం పెద్ద ఇష్యూ అయింది. ప్రపంచంలోనే ఉత్తర పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ అని తాను ఇప్పటికీ చెబుతానని ఆదివారం సీఎం మమత అన్నారు. అసలు సీపీ రాజీవ్ కుమార్ కి శారదా స్కామ్ తో ఉన్న సంబధమేమిటో ఒకసారి చూద్దాం.
ఉత్తరాఖాండ్ లోని యూనిర్శిటీ ఆఫ్ రూర్కీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యేయేషన్ పూర్తి చేసిన రాజీవ్ కుమార్(53) 1898 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. పశ్చిమబెంగాల్, కోల్ కతా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో ఆయన విధులు నిర్వహించారు. బీర్బూమ్ ఎస్పీ, ఎన్ ఫోర్స్ మెంట్ బ్రాంచ్ స్పెషల్ ఎస్పీ, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్(స్పెషల్ టాస్క్ ఫోర్స్), డీఐజీ(సీఐడీ) వంటి వివిధ హోదాల్లో పని చేశారు.
వెస్ట్ బెంగాల్ లో వెలుగుచూసిన శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసు దర్యాప్తుకి సంబంధించి 2013 ఏప్రిల్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించింది. ఈ దర్యాప్తు బృందానికి రాజీవ్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ కేసుకి సంబంధించి శారదా గ్రూప్ ప్రయోటర్ సుదిప్త సేన్ కి చెందినదిగా భావించిన ఓ డైరీని, ల్యాప్ టల్యాన, ఐదు సెల్ ఫోన్లు, కొన్ని డాక్యుమెంట్లను సిట్ బృందం స్వాధీనం చేసుకొంది.
2014లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ ప్రారంభించింది. శారదా స్కామ్, ఇతర చిట్ ఫండ్ స్కామ్ లలో అరెస్ట్ అయిన వారి ఇంటరాగేషన్ సమయంలో..సీట్ సీజ్ చేసిన కీలకమైన ఆధారాలను తమకు అందించలేదని సీబీఐ అధికారులు నిర్థారించుకున్నారు. డైరీ, పెన్ డ్రైవ్, డాక్యుమెంట్స్ కూడా తమకు అందించలేదని సీబీఐ అధికారులు కనుగొన్నారు. ఈ స్కామ్ లో ప్రభుత్వంలోని పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు, వాళ్ల లావాదేవీలకు సంబంధించిన రికార్డులు ఉన్నందునే అమి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం తమకు అందజేయలేదని సీబీఐ దర్యాప్తు బృందంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మమత సర్కార్ లోని కొందరు పెద్ద వ్యక్తులకు ఈ కుంభకోణంలో పాత్ర ఉందని, ఈ కేసు విచారణను నీరుగార్చేందుకు ప్రస్తుత కోల్ కతా సీపీగా ఉన్న రాజీవ్ కుమార్ ప్రయత్నించారని, స్కామ్ కి సంబంధించిన కీలక ఆధారాలను ఆయన నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆరోపిస్తోంది.