Kerala Covid Cases : కేరళలో కరోనా విలయం.. రెండు రెట్లు పెరిగిన మరణాలు

కేరళలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే కేరళలో కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. కేవలం 24 గంటలలోనే 66గా ఉన్న మరణాల సంఖ్య 135కు చేరింది. గత నెల రోజులుగా కేరళలో ప్రతీ రోజు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Kerala COVID-19 Cases : కేరళలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే కేరళలో కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. కేవలం 24 గంటలలోనే 66గా ఉన్న మరణాల సంఖ్య 135కు చేరింది. గత నెల రోజులుగా కేరళలో ప్రతీ రోజు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్థుతం కేరళలో కరోనా కేసుల సంఖ్య 32 లక్షల 83 వేలుగా ఉంది.

ఇక మొత్తం కరోనా మరణాల సంఖ్య 16 వేల 170కి చేరింది. గడిచిన 24 గంటల్లో 14 వేల 912 మంది కరోనా రోగులు కోలుకుని.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 31 లక్షల 29 వేల 638కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 36 వేల 814 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇండియాలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతోంది.  కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,29,638కు చేరుకుంది.  ప్రస్తుతం 1,36,814 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది.

భారత్‌లో  ఇతర రాష్ట్రాల్లో కంటే కేరళలోనే కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. 2021 జూన్ చివరి వారంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 11,000 కనిష్టానికి చేరుకుంది. గత రెండు వారాలలో నెమ్మదిగా పెరుగుతోంది. అదే సమయంలో, మే మొదటి వారంలో రెండవ వేవ్ పీక్ చేరుకున్న తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. సగటున రోజువారీ కొత్త కేసులు ప్రస్తుతం 16వేలకు చేరాయి.  కేరళ ప్రస్తుతం దేశంలో యాక్టివ్  కేసులు 35శాతం వరకు ఉన్నాయి.

ఇప్పటివరకు, కేరళ రాష్ట్ర జనాభాలో కరోనా పరీక్షలు 9.2 శాతం పాజిటివ్ గుర్తించగా.. భారత్ లో  2.3శాతంగా నమోదైంది. కేరళలో ఇప్పటివరకు మిలియన్ జనాభాకు మొత్తం కరోనా టెస్టులు జాతీయ సగటు కంటే 2.2 రెట్లు అధికంగా ఉన్నాయి. కేరళలో ఇప్పటివరకు మొత్తం పరీక్షలలో 35శాతం మాత్రమే ఆర్టీ-పిసిఆర్ కాగా.. భారత్‌లో 48శాతంగా నమోదైంది.

 

ట్రెండింగ్ వార్తలు