భారత్ లో త్వరలో సిగరెట్లు బ్యాన్ అవబోతున్నాయా?ఆ దిశగా కేంద్రంగా వేగంగా అడుగులు వేస్తోందా అంటే ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు అవుననే చెబుతున్నాయి. ప్రతి ఏటా భారత్ లో లక్షల మంది ధుమపానం కారణంగా అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ధుమపానం ఆరోగ్యానికి హానికారం అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ధుమాపానం చేసే వాళ్ల సంఖ్య తగ్గలేదు. దీంతో టుబాకో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. ధరలు పెంచి ధుమపానం చేసే వాళ్ల సంఖ్యను క్రమంగా తగ్గించి.. ప్రాణాలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించాలని ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి ఫలించలేదు.
దీంతో పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా మొదటిగా ఈ సిగరెట్లపై బ్యాన్ విధించింది. ఈ-సిగరెట్లకు సంబంధించిన ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ఈ సిగరెట్లకు సంబంధించిన ప్రకటనలు అన్నీ బ్యాన్ చేసినట్లు ఆమె తెలిపారు.
పొగాకు సంబంధిత అనారోగ్యాల కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం 9 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు.పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారామె. తొలిసారి ఈ-సిగరెట్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుందన్నారు. ఎక్కువసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా ఉంటుందన్నారు. సాధారణ సిగరెట్లను కూడా తాము ప్రోత్సహించడం లేదని ఆమె తెలిపారు. పొగాకు వినియోగం తగ్గించాలనేదే ప్రభుత్వ ఆశయమని తెలిపారు. భారతదేశంలో లైసెన్స్ లేని ఇ-సిగరెట్లు పొగాకును కాల్చవు కానీ.. వినియోగదారులు పీల్చే ద్రవ నికోటిన్‌ను ఆవిరి చేయడానికి తాపన మూలకాన్ని ఉపయోగిస్తాయి. అదే మండే సిగరెట్ నుండి దీన్ని వేరు చేస్తుంది.
కేంద్రం ఈ సిగరెట్లను బ్యాన్ చేస్తూ ప్రకటన చేసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు సిగరెట్లను బ్యాన్ చేయబోతున్నారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సిగరెట్లు బ్యాన్ చేసిన తర్వాత తమ వ్యాపారం ఇంకా బాగా జరుగుతుందని టొబాకో కంపెనీలు సంబరపడుతున్నాయి అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. ఈ సిగరెట్ల కన్నా టొబాకో ఉన్న సిగరెట్లు ఆరోగ్యానికి హానికారం అయితే ఈ సిగరెట్లను బ్యాన్ చేసి టొబాకో సిగరెట్లను ఎందుకు బ్యాన్ చేయరు అని కొందరు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.