మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ను నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అన్నీ సిద్ధం చేస్తోంది. 2022లో మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టు ఉంటుందని
మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ను నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అన్నీ సిద్ధం చేస్తోంది. 2022లో మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టు ఉంటుందని ఇటీవల ఇస్రో చీఫ్ శివన్ వెల్లడించారు. కాగా, అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములకు ఎలాంటి ఫుడ్ ఇస్తామో తెలుపుతూ ఇస్రో ఫుడ్ మెనూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆహార పదార్థాల లిస్ట్ లో ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, ఇడ్లీ, మూంగ్ దాల్ హల్వా, వెజ్ పులావ్ లాంటివి ఉన్నాయి.
ఈ ఫుడ్ మెనుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కొందరు నెటిజన్లు ఫన్నీగా ట్వీట్ చేస్తున్నారు. ”మరి మసాల దోశ, బిర్యానీ ఏం పాపం చేశాయి? వాటిని మెనూలో ఎందుకు చేర్చలేదు” అని ఓ నెటిజన్ ఇస్రోకి ట్వీట్ చేశాడు. ”రసగుల లేదా.. ఇది చాలా చీప్ మెనూ”.. అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ”పోహా కహా హై” అని మరో నెటిజన్ అడిగాడు. ”No Sabudana wada for fasting astronauts? ” అని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా నెటిజన్లు రకరకాలుగా చాలా ఫన్నీగా ట్వీట్లు పెట్టారు.
Why not Masala dosa and Biriyani ? https://t.co/AL2eXzi1SD
— Naveenkumar (@NaveenTwtz1) January 7, 2020
No Sabudana wada for fasting astronauts? https://t.co/wbYSLGcYSP
— मोर (@13MMGM) January 7, 2020
2022లో మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టు ఉంటుందని ఇటీవల ఇస్రో చీఫ్ శివన్ వెల్లడించారు. ఇందుకోసం నలుగురిని ఫైనల్ చేసింది ఇస్రో. 8మందితో కూడిన బృందం రష్యాలో శిక్షణ పొందగా… వీరిలో నలుగురిని ఎంపిక చేశామని ఇస్రో చీఫ్ తెలిపారు. అయితే వారి గురించిన సమాచారాన్ని తెలపలేదు. కాగా, అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములకు ఎలాంటి ఫుడ్ ఉండాలో నిర్ణయించారు. వారికి పూర్తిగా స్వదేశీ ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు.
Ye sab kyo? Are halwai ko le jao space mein ? https://t.co/snU2eVWcIs
— नागराज ❁ (@friendlynagraj) January 7, 2020
ఫుడ్ మెనును ఇస్రో విడుదల చేసింది. ఆ ఆహార పదార్థాల లిస్ట్ లో ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, ఇడ్లీ, మూంగ్ దాల్ హల్వా, వెజ్ పులావ్ లాంటివి ఉన్నాయి. వాటిని మైసూరులోని డెఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబరేటరీ ఫైనల్ చేసింది. ఫుడ్ హీటర్లను కూడా వ్యోమగాములకు అందుబాటులో ఉంచనున్నారు. అంతరిక్షంలో తేలియాడే వ్యోమగాముల కోసం తాగేందుకు ప్రత్యేకమైన కంటైనర్లు తయారు చేశారు. వాటర్, జ్యూస్‌లను తీసుకువెళ్లేందుకు స్పెషల్ ప్యాకెట్లను డీఆర్‌డీవో తయారు చేసింది.