జమ్ము కశ్మీర్ లో పరిస్థితులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత పర్యటనకు ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ఇదే విషయమై మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చైనా మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నరేంద్ర మోడీ సర్కార్ చోద్యం చూస్తోందని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం చెన్నైలో చైనా అధ్యక్షుడి భేటీ సమయంలో జిన్‌పింగ్ పాక్ అనుకూల వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. బుధవారం ఇమ్రాన్‌తో భేటీ సందర్భంగా అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలతో సంబంధం లేకుండా చైనా-పాక్ బంధం కొనసాగుతుందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కశ్మీర్ గురించి ప్రస్తావించినప్పుడు… హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు, జినియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, టిబెట్‌లో అణిచివేత వంటి,దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలను తాము గమనిస్తున్నామని ప్రధానమంత్రి కార్యాలయం కానీ,విదేశాంగశాఖ కానీ ఎందుకు లేవనెత్తదని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ప్రశ్నించారు. భారత అంతర్గత వ్యవహరాల్లో చైనా జోక్యాన్ని కేంద్రం నియంత్రించడంలో విఫలమవుతోందని మండిపడ్డారు.
Xi Jingping says he is watching Kashmir but why does @PMOIndia/MEA not say 1)We are watching Pro Democracy protests muzzled in Hong Kong. 2 )We are watching human rights violations in Xinjiang. 3 )We are watching continued oppression in Tibet 4 )We are watching South China Sea
— Manish Tewari (@ManishTewari) October 10, 2019