రిపబ్లిక్ డే ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు మాత్రమే. సరదాగా ఇంటిలో ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్‌లతో ఆ రోజు గడిపేస్తారు. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలకు సైతం స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రోజు ఎంత మంది స్మరిస్తుంటారు.
రిపబ్లిక్ డే ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు మాత్రమే. సరదాగా ఇంటిలో ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్‌లతో ఆ రోజు గడిపేస్తారు. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలకు సైతం స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రోజు ఎంత మంది స్మరిస్తుంటారు.
అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతీ ఏడాది అదే తేదీన రిపబ్లిక్ డ జరుపుకుంటున్నామని అందర భావిస్తారు. కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగారు.
లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగంగా మిగిలిపోయినా పర్వాలేదు అనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దుకాబడి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఎన్నిక కాగా, డాక్టర్ అంబేడ్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యాయనం చేసి ప్రజాస్వామ్య విధానంగా రాజ్యాంగానన్ని రూపొందించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది.