సీబీఐ దాడులకు తానేమీ భయపడబోనన్నారు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. రాజకీయ కుట్రలో భాగంగానే అక్రమమైనింగ్ కేసులో తనపై సీబీఐ విచారణ జరుగుతందని అఖిలేష్ అన్నారు. మంగళవారం తన ఇంట్లో భార్య డింపుల్ యాదవ్, పిల్లలతో కలిసి ఉన్న ఫొటోని అఖిలేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నేను వార్తలలో ఎందుకు ప్రస్తావించబడుతున్నానో ప్రపంచానికి తెలుసు. చెడు ఉద్దేశ్యంతో జరుగుతున్న ఆ న్యూస్ చూసి బాధపడటం ఎందుకు అంటూ ఆ ఫొటోకి అఖిలేష్ కాప్షన్ ఇచ్చారు.
ఇప్పుడు సీబీఐకి కూడా ఎస్పీ-బీఎస్పీ పొత్తులో ఎన్ని సీట్లు షేర్ చేసుకుంటుందో చెప్పాలని అఖిలేష్ అన్నారు. బీజేపీ తన రంగు చూపించడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. గతంలో సీబీఐని కలిసే అవకాశం కాంగ్రెస్ ఇచ్చిందని, ఇప్పుడు బీజేపీ తమకు ఈ అవకాశం ఇచ్చిందని అఖిలేష్ అన్నారు.
యూపీ సీఎంగా అఖిలేష్ ఉన్న సమయంలో మైనింగ్ శాఖను కూడా అఖిలేష్ తన వద్దే ఉంచుకొన్నారు. ఆ సమయంలో యూపీ ప్రభుత్వం 22 మైన్స్ ను లీజుకిచ్చింది. అయితే అందులో 14 మైన్స్ లీజులను అఖిలేష్ క్లియర్ చేశారని, మిగతావి అప్పటి మంత్రి గాయత్రి ప్రసాద్ క్లియర్ చేశారని, అఖిలేష్ మైనింగ్ స్కామ్ లో అఖిలేష్ భాగస్వామ్యం ఉందని నిరూపించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయని సీబీఐ వర్గాలు తెలిపాయి.