Illegal Affair : ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి..12 గంటలు బెడ్‌రూమ్‌ లోనే

వివాహేతర సంబంధం మోజులోపడి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలరాణి (37) దంపతులు.. గత కొంతకాలంగా రాణి భర్తకు తెలియకుండా ఓ యువకుడితో వివాహేతర సంబంధం నడుపుతుంది. భర్తకు విషయం తెలియడంతో ఆమెను మందలించాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై కోపం పెంచుకొని ప్రియుడితో కలిసి హత్య చేసింది.

Illegal Affair

Illegal Affair : వివాహేతర సంబంధం మోజులోపడి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలరాణి (37) దంపతులు.. గత కొంతకాలంగా రాణి భర్తకు తెలియకుండా ఓ యువకుడితో వివాహేతర సంబంధం నడుపుతుంది.

కొద్దీ రోజులకు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. కుటుంబ సభ్యులు భర్త అదెంచెరి తెలిపారు. ఈ సమయంలోనే ప్రవర్తన మార్చుకోవాలని పలు మార్లు రాణిని హెచ్చరించాడు భర్త. ఇది మనసులో పెట్టుకొని ఎలాగైనా భర్తను హత్యచేయాలని పథకం వేసింది. దీంతో జులై 28న రాత్రి త‌న బాయ్ ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించుకుంది. భ‌ర్త నిద్రిస్తున్న స‌మ‌యంలో అత‌నిపై క‌త్తితో దాడి చేసి చంపేశారు. 12 గంటలు మృతదేహాన్ని బెడ్ రూమ్ లోనే ఉంచారు.

అదెంచెరి తండ్రి ఫిర్యాదుతో

అదెంచెరి క‌నిపించ‌క‌పోవ‌డంతో జులై 29న అత‌ని తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అదెంచెరితోపాటు అతడి భార్య, కుమారుడు కూడా కనిపించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే అదెంచెరి తండ్రి రాణికి ఫోన్ చేసి తన కుమారుడికి ఫోన్ ఇవ్వాలని కోరాడు.. అందుకు ఆమె నిరాకరించింది.. తన కుమారుడు ఆన్‌లైన్ క్లాస్ వింటున్నదని మామకి చెప్పింది. అయితే కోడలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అదెంచెరి తండ్రి కోడలిపైనే అనుమానం ఉండాలి పోలీసులకు తెలిపాడు.

కోడలు రాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అయితే మొదట ఆమె తనకేమి తెలియదని సమాధానం చెప్పింది. పోలీసులు తమదైన రీతిలో విచారణ చేయడంతో హత్యచేసినట్లు ఒప్పుకుంది. అయితే పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. మృతదేహాన్ని సోమమంగళం గ్రామానికి సమీపంలోకి చెరువులో పడేశామని తెలిపింది.

పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. ఎంతకీ మృతదేహం దొరక్కపోవడంతో అనుమానం వచ్చి మరోసారి విచారించారు. దీంతో చెంగ‌ల్‌ప‌ట్టులోని అడ‌వుల్లో అదెంచెరి మృత‌దేహానికి నిప్పు పెట్టామ‌ని తెలిపింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతం స్టేషన్ కు సమాచారం ఇచ్చి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు.

భ‌ర్త‌ను చంపిన త‌ర్వాత అత‌ని మృత‌దేహం అక్క‌డే ఉంచి.. రాణి, ఆమె ప్రియుడు బెడ్‌రూమ్‌లోనే 12 గంట‌ల పాటు గ‌డిపారు. ఆ త‌ర్వాత డెడ్‌బాడీని చెంగ‌ల్‌ప‌ట్టు తీసుకెళ్లి నిప్పంటించిన‌ట్లు రాణి తెలిపింది. ఈ కేసులో ఇద్దరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు. రాణిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడికోసం గాలిస్తున్నారు.