వికీపీడియా సంస్థ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాసింది. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త గైడ్ లైన్స్ కారణంగా తమ మోడల్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని
వికీపీడియా సంస్థ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాసింది. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త గైడ్ లైన్స్ కారణంగా తమ మోడల్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని లేఖలో వాపోయింది. ఆటోమేటెడ్ ఫిల్టరింగ్, ఉపసంహరణలు, కంటెంట్ బ్యాన్.. తమ నమూనాకు భంగం కలిగిస్తాయని లేఖలో వాపోయింది. కొత్త రూల్స్ కారణంగా వెబ్ సైట్ కి ఇబ్బందులు కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేసింది.
వెబ్ సైట్ల నియంత్రణ కోసం కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తోంది. పర్సనల్ డేటా ప్రొటక్షన్ చట్టం తీసుకురానుంది. లోక్ సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉంటుంది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. ఇల్లీగల్, అసభ్యకరమైన కంటెంట్ ఉంటే వెంటనే తొలగిస్తుంది. ఆ సైట్లు బ్లాక్ అవుతాయి. ఇల్లీగల్ కంటెంట్ ఉంటే.. మన దేశంలో కనిపించకుండా బ్యాన్ చేస్తారు. ఇందుకోసం ఆటోమేటిక్ వ్యవస్థను రూపొందించారు.
కాగా, ఈ గైడ్ లైన్స్.. వికీపీడియా నిర్వహణకు సమస్యగా మారనున్నాయి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వికీపీడియా నిర్వహిస్తున్నారు అనే సంగతి తెలిసిందే. వికీపీడియాలో సమస్త సమాచారం లభిస్తుంది. మన దేశంలో చాలా పాపులర్. 2019 నవంబర్ లో భారత దేశంలో 711 మిలియన్ల సార్లు వికీపీడియాను విజిట్ చేశారు. యూజర్లు ఎవరైనా ఎడిట్ చేసి సమాచారం ఇవ్వొచ్చు.
అయితే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కారణంగా తమపై ఆర్థిక భారం పడుతుందని వికీపీడియా వాపోయింది. ఈ విషయంలో తమకు వెసులుబాటు కల్పించేలా చూడాలని వికీపీడియా లేఖలో కేంద్రాన్ని కోరింది. వికీపీడియా ఆర్టికల్ లోని మార్పులను ఒక దేశంలో కనిపించకుండా నిరోధించడం అసాధ్యం అని చెప్పింది. అలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా వికీపీడియాలో సమస్యలు వస్తాయని వెల్లడించింది.