COVID-19 vaccine deliver through mohalla clinics : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మూడో దశకు చేరుకుంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగిపోతున్నాయి. నవంబర్ 7 వరకు ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరింది.
కానీ, కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అంతకుముందు కంటే కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టినట్టు ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
రెండు కరోనా పాజిటివిటీ రేటు కంటే సగానికి పైగా తగ్గినట్టు ఆయన చెప్పారు. నవంబర్ 7న 15.26శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు ఇప్పుడు 8.51 శాతానికి తగ్గిపోయిందని జైన్ తెలిపారు. గతంలో కంటే పాజిటివిటి రేటు సగానికి పైగా పడిపోయిందని చెప్పారు.
కరోనా వ్యాక్సినేషన్ కోసం అవసరమైన వనరులను ఢిల్లీ ప్రభుత్వం మూడు లేదా నాలుగు వారాల్లో పూర్తి చేయనుందని జైన్ స్పష్టం చేశారు. నగరంలోని ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ ఫెసిలిటీ మోహల్లా క్లినిక్స్ ద్వారా కరోనా వ్యాక్సిన్ ప్రజలకు పంపిణీ చేస్తామని జైన్ తెలిపారు.
ప్రస్తుతానికి కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నగరవాసులందరికి మూడు లేదా నాలుగు వారాల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
https://10tv.in/new-coronavirus-symptoms-were-just-discovered-that-could-be-early-warning-signs/
నగర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం మోహల్లా క్లినిక్స్, పాలీక్లినిక్స్, డిస్పాన్సారీస్, ఆస్పత్రులు వంటి సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.
వ్యాక్సిన్ స్టోరేజీ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో బాధితుల కోస తగినంత స్థాయిలో ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు.
మొత్తంగా 9,500 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. 1,200 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 50 శాతం కంటే ఎక్కువ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. మొత్తంగా బెడ్స్ 9,500 వరకు అందుబాటులో ఉన్నాయి.